రాత్రి సమయంలో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారా…. తస్మాత్ జాగ్రత్త!

guy-eating-at-fast-food-restaurant

ప్రతిరోజు ఆహారం తినే విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమా అనేవారు చాలామంది ఉంటారు. అయితే కాలానుగుణంగా వస్తున్న విపత్కర మార్పుల కారణంగా ప్రతిరోజు తినే ,తాగే విషయంలో కొన్ని నియమాలు ,జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి భోజనం తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. రాత్రి సమయాల్లో మన శరీర జీవక్రియలు కొంతమేర మందగిస్తాయి. దాంతోపాటే జీర్ణశక్తి కూడా తగ్గుతుంది కావున రాత్రి సమయాల్లో సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మీ సుఖప్రదమైన నిద్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తవు .

సాధారణంగా వైద్యుల సూచన ప్రకారం రాత్రి 7:30 గంటల తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదని చెబుతుంటారు. కానీ ఈ రోజుల్లో చాలామందికి ఈ నియమాన్ని పాటించడం కుదరకపోవచ్చు అందుకే రాత్రి సమయాల్లో తీసుకోదగిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట తినేందుకు ఆపిల్, పీనట్ బట్టర్ చక్కని కాంబినేషన్ అని చెప్తున్నారు. ఆపిల్ సులువుగా జీర్ణం అవ్వడమే కాకుండా అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఫైబర్ వంటి పోషకాలు మీ శరీరాన్ని శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.

రాత్రి సమయాల్లో బాగా ఆకలిగా అనిపిస్తే అవకాడో టోస్ట్ ను నిక్షేపంగా తినొచ్చు. ఇందులో కొవ్వు పదార్థాలు శూన్యం కావున సులువుగా జీర్ణమవుతుంది మరియు మెదడు ఆరోగ్యానికి సహాయపడి మెగ్నీషియం లభిస్తుంది.కావున మానసిక ప్రశాంతతకు సహాయపడి సుఖప్రదమైన నిద్రను కలగజేస్తుంది. డార్క్ చాక్లెట్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి కావున రాత్రి సమయాల్లో వీటిని తింటే ఆకలిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయి. సుఖప్రదమైన నిద్రకు సహాయపడే మెల్లటోనిన్ అనే హార్మోన్ బ్లూ బెర్రీలో సమృద్ధిగా లభిస్తుంది. కావున వీటిని రాత్రి సమయాల్లో తినొచ్చు. క్యారెట్ ముక్కలపై బెల్ పేపర్ వేసుకొని రాత్రి సమయాల్లో తింటే సంపూర్ణ పోషకాలు లభించడంతోపాటు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.