చలి వాతావరణంలో చిక్కుడుకాయను ఆహారంగా తీసుకుంటున్నారా….ఇది తెలుసుకోవాల్సిందే!

చల్లని వాతావరణంలో మాత్రమే సమృద్ధిగా లభ్యమయ్యే చిక్కుడుకాయను తినడానికి చాలామంది సంకోచిస్తుంటారు. చిక్కుడు గింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే తమ రోజువారి ఆహారంలో తప్పనిసరిగా చిక్కుడుకాయను తినడానికి ఇష్టపడతారు. శీతాకాలంలో పల్లె వాతావరణంలో ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా చిక్కుడు పాదు కనిపిస్తూ గుత్తులు గుత్తులు చిక్కుడుకాయలు దర్శనమిస్తుంటాయి. చిక్కుడుకాయలో మన ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్స్ సమృద్ధిగా లభించడంతోపాటు విటమిన్ సి, బి 1, ఐరన్, కాపర్ , మాంగనీస్ ,జింకు మెగ్నీషియం ఫాస్పరస్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

చిక్కుడుకాయను మన రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే చిక్కుడు గింజల్లో పుష్కలంగా ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్, గుండె జబ్బులు, రక్త పోటు, కిడ్నీ సమస్యలను తగ్గించడంతోపాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. చిక్కుడుకాయలో సమృద్ధిగా లభించే విటమిన్ బి 1, మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరిచే ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే చిక్కుడు గింజల్లో పుష్కలంగా ఉండే కాపర్ డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాల విడుదలకు తోడ్పడి నాడీ కణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మెదడు చురుకుదనాన్ని ప్రోత్సహించి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

చిక్కుడుకాయలో ఎక్కువగా ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి చెడు మలినాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ,అతిబరువు సమస్యతో బాధపడేవారు చిక్కుడుకాయలను తరచూ ఆహారంలో తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. చిక్కుడులో సెలీనియం మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచి శ్వాస వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చిక్కుడు గింజల్లో సమృద్ధిగా లభించే అమైనో ఆమ్లాలు హార్మోన్ల క్రమబద్ధీకరించి మానసిక ప్రశాంతతను నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. వీటిలో సమృద్ధిగా లభించే ప్రోటీన్స్ మన శరీర కండల వ్యవస్థను దృఢపరిచి కండరాల నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గి స్తుంది.