రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా… ఆపిల్ ఈ సమయంలో తీసుకుంటే మీ సమస్యకు చెక్ పెట్టవచ్చు!

apple-1000x1000 (1)

ప్రతిరోజు ఆపిల్ పండ్లను ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే విషయం చాలా సార్లు వినే ఉంటాం కదా. అయితే ఆపిల్ పండ్లను ఉదయాన్నే అల్పాహారం కంటే ముందే తింటే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆపిల్

పండ్లలో మన శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి.కావున ఆపిల్ పండ్లను ప్రతిరోజు ఖాళీ కడుపుతో తింటే కార్బోహైడ్రేట్స్ ను మన శరీరం పూర్తిగా గ్రహించి తక్షణ శక్తిని పొందుతుంది. తద్వారా మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.

 

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కంటే ముందే ఆపిల్ పండు తినడం వల్ల ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, డెంటరి ఫైబర్, అధిక కేలరీలు  త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. తద్వారా ఆహారం తక్కువగా తీసుకొని సులభంగా బరువు తగ్గవచ్చు.

ఆపిల్ పండ్లలో పొటాషియం ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నివారించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కావున ప్రతిరోజు ఉదయాన్నే తాజా ఆపిల్ పండును తినడం ఉత్తమం.

 

ఆపిల్ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది కావున ఉదయాన్నే ఆపిల్ పండ్లను లేదా ఆపిల్ జ్యూస్ ను తీసుకుంటే ఐరన్ మూలకాన్ని గ్రహించే శక్తి పెరిగి మనలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది తద్వారా రక్తహీనత సమస్య తొలగిపోతుంది.యాపిల్ తొక్కలో ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ ఉంటుంది ఇది శరీరంపై వాపు ,మంటలు తగ్గుతాయి. మలబద్ధక సమస్యతో బాధపడేవారు తరచూ ఉదయాన్నే ఆపిల్ ను ఆహారంగా తీసుకుంటే ఇందులో పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధక సమస్యలు దూరం చేస్తుంది