అరటిపండు ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు ఒక తాజా అరటిపండును ఆహారంగా తీసుకుంటే అతి చౌకగా మనలో పోషకాహార లోపాన్ని సవరించుకోవచ్చు. అరటి పండులో నిత్య జీవక్రియలకు అవసరమైన అన్ని సహజ పోషక పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి, బీ6, పొటాషియం, ఫైబర్ , మెగ్నీషియం, మాంగనీస్,జింక్ వంటి ఖనిజా లవణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్స్ , కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.
ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరటి పండును ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి మనలో ఇమ్యూనిటీ సిస్టం అభివృద్ధి చెంది అనేక రకాల మొండి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అధిక పని ఒత్తిడి కారణంగా నీరసం,అలసటగా ఉన్నప్పుడు అరటిపండును తింటే వీటిలో సమృద్ధిగా ఉన్న కార్బోహైడ్రేట్స్ ఇన్‌స్టంట్ ఎనర్జీని అందించి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్త పోటు ,గుండె జబ్బుల సమస్యను తొలగిస్తుంది. అరటి పండులో అత్యధికంగా ఉన్న మెగ్నీషియం నాడీ కణాలను రక్షించి మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.కండరాల రిలాక్సేషన్‌కు ,కండరాల పటుత్వానికి మెగ్నీషియం అద్భుతంగా సహాయడుతుంది.
మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి భోజనం తర్వాత ఒక అరటి పండును తింటే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ బీ9, మెగ్నీషియం, పోలేట్ వంటివి యాంటీ డిప్రెషన్ లక్షణాలను తొలగించి మానసిక ప్రశాంతత కలిగించడంతోపాటు నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు తరచూ అరటి పనులను తీసుకుంటే వీటిలో స్కలంగా ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు అరటిపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో ఎక్కువగా ఉన్న కార్బోహైడ్రేట్స్ వ్యాధి తీవ్రతను మరింత పెంచే ప్రమాదం ఉంది .కావున ఇలాంటివారు వైద్య సలహాలు తీసుకొని అరటిపండు తినడం మంచిది.