రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ ఇది తాగితే చాలు!

సాధారణంగా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యలలో రక్తహీనత సమస్య ఒకటి. ఈ మధ్యకాలంలో రక్తహీనత సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికమవుతుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతుంది ముఖ్యంగా మహిళలలో ఈ విధమైనటువంటి సమస్య తలెత్తుతూ ఉంటుంది. మహిళలలో ప్రతినెల రుతుక్రమం రావడం వల్ల అధిక రక్తస్రావం జరిగి ఎక్కువ మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు.

ఈ విధంగా రక్తహీనత సమస్య కారణంగా మన శరీరంలో రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం కాకుండా మన శరీరానికి సరైన మోతాదులో ఆక్సిజన్ లభించగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే కొన్నిసార్లు ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి.అయితే రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ ఈ పానీయం తాగితే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడానికి ఎండిన నల్ల ద్రాక్ష ఎంతో దోహదపడుతుంది.ప్రతిరోజు రాత్రి మనం పడుకునే ముందు రెండు గ్లాసుల నీటిని మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో పది నల్ల ఎండు ద్రాక్షలు వేసి మరొక ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఐదు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసిన అనంతరం ఆ గిన్నెపై ప్లేట్ మూసి రాత్రంతా అలాగే ఉంచాలి.మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగటం వల్ల నల్లని ఎండు ద్రాక్షలో ఉన్నటువంటి పోషకాలన్ని నీటిలో చేరి మన శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయడానికి రక్త కణాల పెరుగుదలకు దోహదపడుతుంది. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.