ఉరుకుల పరుగులు పెడుతున్న ఈ కాలంతో పాటు మనం కూడా అలాగే ఉరుకులు పరుగులు పెడుతూ కాలంతో పాటు పరిగెత్తాల్సి ఉంటుంది.ఇలా కాలంతో పాటు పరుగులు తీయాలంటే ప్రతిరోజు మనం చేయాల్సిన సమయానికి పనులు పూర్తి చేస్తేనే మనం ఏ విషయంలోనైనా సక్సెస్ సాధించగలం. ఈ క్రమంలోనే మన పనులన్నీ అనుకున్న సమయానికి జరగాలంటే ఉదయం మనం త్వరగా నిద్రలేవాలి. అయితే చాలామంది ఉదయం నిద్ర లేవడానికి ఎంతో బద్ధకిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం తొందరగా లేవాలని ప్రయత్నం చేసిన లేవలేక పోతుంటారు.
ఈ విధంగా ఉదయం త్వరగా నిద్ర లేవాలంటే ఒక సరైన ప్రణాళిక వేసుకుని ఉండాలి. ఉదయం తొందరగా నిద్ర లేచినప్పుడు మన పనులన్నీ కూడా సవ్యంగా జరిగి ఎంతో ప్రశాంతంగా ఉంటాం లేదంటే ఆలస్యం అవ్వడం వల్ల ఎంతో కంగారు పడుతూ ఎన్నో చికాకులు తెచ్చుకోవడమే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తుంటాము.అయితే ఉదయం తొందరగా లేవాలంటే మనం రాత్రి తొందరగా పడు కుంటేనే ఉదయం తొందరగా లేవగలము.
రాత్రి సమయంలో ఒక గంట ముందు మన మొబైల్ ఫోన్స్ లాప్టాప్ వంటి వాటిని పక్కన పెట్టడం వల్ల ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. ఇలా రాత్రి తొందరగా నిద్రపోతే ఉదయం తొందరగా నిద్ర లేస్తాము. ఇక వీలైతే రాత్రి పూట కాస్త తక్కువగా ఆహారం తీసుకోవడం మంచిది.కాస్త తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సక్రమంగా జరిగి సుఖంగా నిద్ర వస్తుంది. అలా కాకుండా ఎక్కువ ఆహారం తీసుకొని పడుకోవటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తడం వల్ల చాలామందికి త్వరగా నిద్ర పట్టదు. అందుకే ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఉదయం తొందరగా నిద్ర లేవచ్చు.