వేసవిలో తొందరగా నీరసించి పోతున్నారా… సబ్జా గింజలతో నీరసానికి చెక్ పెట్టండి!

sabjaseed

వేసవి సీజన్ వచ్చేస్తోంది ప్రతి ఒక్కరు ఎండ తాపం నుంచి రక్షణ పొంది శరీరాన్ని చల్లగా, ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఎండ వేడి కారణంగా తొందరగా శరీరంలోని శక్తి మొత్తం తగ్గిపోయి నిరసించి పోవడం డిహైడ్రేషన్ కి గురి కావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా వేసవికాలంలో తొందరగా మనం శక్తిని కూడా కోల్పోతూ ఉంటాము అయితే ఇలా శక్తి కోల్పోకుండా ఉండాలి అంటే మీ రోజువారి డైట్లు సబ్జా గింజలను చేర్చుకుంటే రోజు మొత్తం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతోపాటు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించి జీవక్రియలను బ్యాలెన్స్ చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి.

సబ్జా గింజలు అన్ని రకాల విటమిన్స్ తోపాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.
సబ్జా గింజలను కాసేపు నీటిలో నానబెడితే మెత్తటి జల్ మాదిరిగా మారుతాయి.ఈ విత్తనాలను మనం తయారు చేసుకుని షరబత్, నిమ్మరసం, పుదీనా జ్యూస్, నన్నారి వంటి అన్ని రకాల జ్యూసుల్లో వేసుకొని సేవిస్తే అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే అన్ని ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కావున ఎండ వేడి నుంచి మనల్ని రక్షించి శరీరాన్ని డిహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడడమే కాకుండా అలసట ,నీరసం ఒత్తిడి వంటి మానసిక లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

సబ్జా గింజల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం, జింక్ విటమిన్ బి12, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించి మానసిక ఒత్తిడి తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. ఇక ఇందులో మెగ్నీషియం కూడా అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలు కూడా తరిమికొడుతుంది.ఇక ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో ఎలాంటి మలబద్ధక సమస్య లేకుండా జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరిచి అజీర్తి సమస్యలను కూడా దూరం చేస్తుంది.