హనీ డైట్ ను ఫాలో అవుతున్నారా.. ఈ షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా?

మనలో చాలామంది బరువు తగ్గడానికి ఆసక్తి చూపిస్తారు. బరువు పెరగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాయామం చేయకపోవడం, తగిన శారీరక శ్రమ లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్లే ఎక్కువమంది బరువు పెరుగుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది బరువు తగ్గడానికి హనీ డైట్ ను ఫాలో అవుతున్నారు.

నిద్రపోయే ముందు ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని పలు పరిశోధనల ద్వారా వెల్లడైంది. అయితే స్వచ్చమైన తేనెను తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. హనీ డైట్ ను ఫాలో కావడం ద్వారా శరీరంలో కొవ్వు నిల్వలు సులువుగా కరిగిపోతాయి. చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగిస్తే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. హనీ డైట్ ను ఫాలో అవుతూ దంపుడు బియ్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

హనీ డైట్ లో ఉన్నవాళ్లు తక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న పండ్లను తీసుకోవాలి. హనీ డైట్ లో ఉన్న సమయంలో బంగాళ దుంపలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉంటే మంచిది. అయితే హనీ డైట్ ను ఫాలో అయ్యేవాళ్లు వైద్యుల సలహాల ప్రకారమే తేనె తీసుకోవాలి. ఎక్కువమొత్తంలో తేనె తీసుకోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఉంటాయని తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.

తేనె ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తేనె గ్యాస్, ఉబ్బరం, ఇతర కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. ఎక్కువ మొత్తంలో తేనె తీసుకోవడం వల్ల ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ మొత్తంలో తేనె తీసుకోవడం వల్ల డయేరియా బారిన పడే అవకాశం కూడా ఉంటుంది.