మాంసాహార ప్రియులకు చికెన్ అంటే ఎంతో ఇష్టం . వారంలో నాలుగు లేదా ఐదు సార్లు కచ్చితంగా మన ఆహారంలో చికెన్ ఉండాల్సిందే. తరచూ మాంసాహారాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా శరీరం దృఢంగా తయారయ్యి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. చికెన్ కర్రీ, ఫ్రై ,కబాబ్ రూపంలో పరిమితంగా తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు. మాంసాన్ని నిప్పుల పైన లేదా మంటపై కాల్చుకొని తింటే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ వ్యాధి వస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజాగా అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ విషయంపై జరిపిన అధ్యయనంలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బార్బిక్యూ లేదా తందూరి పద్ధతిలో మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల కండరాలు పెరిగేందుకు దోహదపడే క్రియాటిన్ ఆర్గానిక్ యాసిడ్ అధికమంట మీద వేడి చేసినప్పుడు సైక్లిక్ అమైన్ అనే క్యాన్సర్ కారకంగా మారే అవకాశాలు చాలా ఉన్నాయని ఈ అధ్యాయంలో స్పష్టమైంది. ఈ పరిశోధన ఫలితాలు వెల్లడించిన దాని ప్రకారం నేరుగా మంటపై కాల్చిన మాంసం తినని వారితో పోలిస్తే తినే వారిలో 60% మందికి భయంకరమైన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పరిశోధన ఫలితాలు వెల్లడించారు.
వైద్య నిపుణుల సూచనల ప్రకారం మాంసాహారాన్ని ఎప్పుడైనా వండుకొని తినడమే ఆరోగ్యానికి మంచిది ఇందులో ఉండే సూక్ష్మ పోషక విలువలు, కొవ్వు పదార్థాలు నశించవు ఫలితంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలా కాకుండా బాబిక్యూ లేదా తందూరి పద్ధతిలో మాంసాన్ని నిప్పు పై డైరెక్ట్ గా కాల్చుకొని తినడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్స్, సహజ కొవ్వు పదార్థాలు నశించడంతోపాటు మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. ఒకవేళ తందూరి చికెన్ తినాలనిపిస్తే మాంసాన్ని నిప్పులపై కాల్చడానికి 30 నిమిషాల ముందు మేరినేషన్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మెరినేషన్ మాంసానికి మంట నేరుగా తగలకుండా ఉంటుంది. దీనివల్ల మాంసంలో ఉండే సహజ పోషకాలు నశించవు అద్భుతమైన రుచితో పాటు క్యాన్సర్ కారక ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చు.