తరచు చెరుకు రసాన్ని సేవిస్తున్నారా..ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?

ప్రతిరోజు ఒక గ్లాసుడు చెరుకు రసాన్ని సేవిస్తే మన శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభించి రోజంతా మనల్ని హుషారుగా ఉంచడంలో సహాయపడుతుంది. చెరుకు రసంలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ,కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. సాధారణంగా వాతావరణం వేడి పెరిగినప్పుడు మన శరీరంలో నీటి శాతం తగ్గి అవయవాల పనితీరు మందగిస్తుంది దాంతో కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చిరాకు ,అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక గ్లాసుడు చెరుకు రసంతో ఈ సమస్యలన్నిటిని అధిగమించవచ్చు.

సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలీన్ స్వభావమున్న చెరుకు రసాన్ని ప్రతిరోజు తాగే వారిలో కోలన్ క్యాన్సర్, ఉదర క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్,చర్మ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని అనేక సర్వేలో వెల్లడింది. చెరుకు రసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది, సంతృప్త కొవ్వులతో పాటు ఆహారంలో తక్కువ సోడియం సామర్థ్యాన్ని కలిగి ఉండడంవల్ల కిడ్నీలోని మలినాలను తొలగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకున్నవారు ప్రతిరోజు చెరుకు రసాన్ని సేవిస్తే ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ సహజ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది కావున శరీర బరువును నియంత్రించడంలో చెరుకు రసం దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

చిన్నపిల్లల శారీరక పెరుగుదలకు అవసరమైన కాల్షియం, క్రోమియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ వంటి మూలకాలు చెరుకు రసంలో సమృద్ధిగా లభిస్తాయి. గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులు చెరుకు రసాన్ని తరచూ సేవిస్తే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. చెరుకు రసంలో సమృద్ధిగా ఉన్న కాల్షియం ఎముకల, దంతాల దృఢత్వానికి తోడ్పడుతుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు తరచూ చెరుకు రసాన్ని సేవిస్తే ఇందులో గ్లైకోలిక్, ఆల్ఫా-హైడ్రాక్సీ వంటి ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
ఇది కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటు మొటిమలను, ముడతలను, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.