వేసవికాలం వచ్చేస్తోంది.. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలంలో తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల వేసవికాలంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వడదెబ్బకు గురైన సమయంలో సరైన ఆరోగ్య చిట్కాలు పాటించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది.

వేసవికాలంలో ఎక్కువమంది హీట్ స్ట్రోక్ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. హీట్ ఎగ్జాషన్, హీట్ ఇంజురీ, హీట్‌ స్ట్రోక్‌ వల్ల కొన్నిసార్లు ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. హీట్ ఎగ్జాషన్‌ అంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అలసటగా ఉండటంతో పాటు కండరాల నొప్పి సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. హీట్ ఇంజురీ వల్ల శరీర భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

హీట్ ఇంజురీ వల్ల కొన్నిసార్లు కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందనిక్ చెప్పవచ్చు. హీట్‌ స్ట్రోక్‌ వల్ల శరీర భాగాలు తీవ్రంగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. మెదడు పనితీరు దెబ్బ తిని స్ట్రోక్ సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిమ్మరసం తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి.

వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. గతంతో పోల్చి చూస్తే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువమొత్తం ఉష్ణోగ్రతలు నమోదవ్గుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలుస్తోంది.