ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో సాధారణం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం అనే సంగతి తెలిసిందే. ఆల్కహాల్ తీసుకోని వాళ్లను సైతం ఈ సమస్య వేధించే ఛాన్స్ ఉంటుంది. కాలేయం సాధారణంగా కొవ్వులను ప్రాసెస్ చేయలేకపోతే, విచ్ఛిన్నం చేయలేకపోతే, ఎక్కువ కొవ్వు పేరుకుపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్, కొన్ని మందులు, గర్భం వంటివి ఫ్యాటీ లివర్ రావడానికి ముఖ్య కారణాలుగా ఉంటాయి.
అలసట, పొత్తికడుపులో అసౌకర్యం, బరువు తగ్గడం, బలహీనత, గందరగోళం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే ఫ్యాటీ లివర్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కొవ్వు కాలేయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఒక రకం ఫ్యాటీ లివర్ వస్తే ఆల్కహాల్ తీసుకోకపోయినా ఇంకో రకం ఫ్యాటీ లివర్ వస్తుందని చెప్పవచ్చు. సరైన జీవన శైలి లేని వాళ్లను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఉసిరి తీసుకోవడం ద్వారా కాలేయానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. ఉసిరి తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఉసిరి ఎక్కువగా తినేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.
వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఫ్యాటీ లివర్ సమస్య వేధిస్తుండగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మంచి లాభాలు సొంతమవుతాయి. ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.