వేసవికాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడి పండ్లు కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడిపండును వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. నోటికి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మామిడి పండుని పండ్ల రాజు అని పిలుస్తారు. అయితే ఈ మామిడి పండ్లను కొందరు తొక్కలతో పాటు తింటే మరికొందరు తొక్క తీసేసి తింటూ ఉంటారు. కొంతమంది మామిడిపండ్లని తొక్క తీసేసి తింటారు. కానీ దాంట్లో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. మామిడి తొక్క లో మాంగిఫెరిన్, బెంజోఫెనోన్ అనే క్రిమినాశక గుణాలు ఉంటాయి.
కాబట్టి మామిడి తొక్క ను క్రిమిసంహారక మందుగా కూడా వాడొచ్చు. మామిడి పళ్ళు అంటే బాగా ఇష్టం ఉన్న షుగర్ పేషంట్స్ మ్యాంగో పీల్ టీ లేదా డీటాక్స్ డ్రింక్ తాగితే బాడీలోని షుగర్ లెవల్ బ్యాలెన్స్ అవుతాయట. అలాగే మామిడి తొక్కలకు యాంటి డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అందులో ఉండే మాంగిఫెరిన్ రక్తంలో చక్కెర లెవెల్ ను కంట్రోల్ చేయడంలో, ఇన్సులిన్ ను మెరుగ్గా చేయడంలో సహాయపడుతుంది. అలాగే మామిడి తొక్కలో పాలిఫెనాల్ లో కెరోటినాయిడ్ ఫోటోప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. అవి చర్మానికి అప్లై చేస్తే యూవీ కిరణాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
అంతే కాకుండా మామిడి తొక్కలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, బయోయాక్టివ్ పదార్థాలు కూడా ఉండడంతో అవి నోటిలో బ్యాక్టీరియా ను నిర్మూలిస్తాయి. కాబట్టి మామిడితొక్కని నమిలి మౌత్‌వాష్ గా కూడా వాడేయచ్చు. దంతక్షయం, చిగుళ్ళు వ్యాధులను కూడా మామిడి తొక్క నివారించగలదు. మామిడి తొక్కలో ఉండే టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ గాయాలను ఎండబెట్టే లక్షణాలు ఉంటాయి. ఏదైనా గాయం అయిన చోట మామిడితొక్క సారాన్ని పూస్తే, ఆ గాయం వేగంగా మానిపోయి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మామిడితొక్కలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పులు, పేగుల వాపుని కూడా తగ్గిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మామిడితొక్కలో క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు ఉన్నాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. మాంగిఫెరిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా తగ్గిస్తుందట.