రోజులో 15 నిమిషాలు వెనక్కి నడిస్తే చాలు ఈ సమస్యలన్నీ మటుమాయం!

3-Reasons-to-Start-Taking-Daily-Walks

చాలామంది అధిక శరీర బరువు తగ్గడం కోసం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు ఇలా వాకింగ్ చేయడం వల్ల కొంతమేర శరీర బరువు తగ్గవచ్చు అని భావిస్తుంటారు అయితే ఇలా ప్రతిరోజు ముందుకు నడుస్తూ వాకింగ్ చేయడం కన్నా రోజులో ఒక పావుగంట వెనక్కి అడుగులు వేస్తూ నడవటం వల్ల అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా పావుగంట వెనక్కి అడుగులు వేస్తున్న నడవడం కాస్త కష్టతరంగా ఉన్నప్పటికీ ఇలా చేయటం వల్ల మన శరీరంలో ఎక్కువ శాతం క్యాలరీలు బర్న్ అవుతూ తొందరగా శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

ఈ విధంగా వెనక్కి నడవడానికి రోడ్ లో కానీ పార్కులో కానీ ప్రయత్నం చేయకూడదు ఇలా రోడ్లపై లేదా పార్కులలో ఇలా వెనక్కి నడుస్తూ వెళ్లడం వల్ల కొన్ని సార్లు ప్రమాదం జరుగుతుంది కనుక మన ఇంటి ఆవరణంలోనే ఇలా పావుగంట పాటు వెనక్కి అడుగులు వేస్తూ నడవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముందుకి నడవడం కన్నా, వెనక్కి నడవడం వల్ల శక్తి 40 శాతం అధికంగా ఖర్చవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అధికంగా అందుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఆస్టియో ఆర్థరైటిస్, కాలి కండరాల నొప్పులు, మడమల నొప్పులు వంటి సమస్యలు ఉన్నవాళ్లు, దీర్ఘకాలిక నడుము నొప్పి సమస్యతో బాధపడేవారు సర్వసాధారణంగా వాకింగ్ చేయకుండా ఇలా పావుగంట పాటు రోజులు వెనక్కి నడవడం వల్ల ఈ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.మొదట్లో ఇలా నడవడం కాస్త కష్టంగా ఉన్నప్పటికీ ఇలా చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు.