ఛాతీలో నొప్పి వస్తుందా.. గుండె సమస్యల నుంచి ఎలా బయటపడాలంటే?

heart_attack_1670417340660_1671001405809_1671001405809

ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత సమస్యల వల్ల మరణించే వాళ్ల సంఖ్య పెరుగుతుండగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జీవన శైలిలో మార్పు వల్లే ఈ సమస్యలు వస్తాయని చాలామంది భావిస్తారు. చాలామంది ఛాతీలో నొప్పి వస్తే వెంటనే తెగ టెన్షన్ పడతారు. అయితే కొన్నిసార్లు ఛాతీనొప్పి గుండె సంబంధిత సమస్యలకు కారణం కాగా మరి కొన్నిసార్లు మాత్రం గుండె సంబంధిత సమస్యలకు కారణం కాదు.

కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కూడా గుండెలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధ పడుతూ ఉంటే ఛాతీలో నొప్పి రావడంతో పాటు గ్యాస్ట్రిక్ ఆమ్లాలు ఎసిడిటీని కలిగించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్యను గ్యాస్ట్రోఈసోఫజెల్ రిఫ్లక్స్ డిసీజ్ అని అంటారు. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆస్తమా, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ అయితే ఉంది.

కడుపు ఉబ్బరంగా ఉన్నా, పుల్లటి త్రేన్పులు వస్తున్నా గ్యాస్ సంబంధిత సమస్యగా భావించాల్సి ఉంటుంది. గుండెనొప్పి అయితే పడుకున్నా లేచినా ఒకే చోట నొప్పి ఉంటుంది. ఛాతీ నొప్పి అయితే పడుకుని లేస్తే నొప్పి ఒకే చోట ఉంటే గుండెనొప్పి కాగా నొప్పి మారుతుంటే మాత్రం గ్యాస్ట్రిక్ సమస్య అయ్యే ఛాన్స్ ఉంది. పల్చటి మజ్జిగ రెండు గ్లాసులు తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య దూరమవుతుంది.

ఇలా కాకుండా గుండె సంబంధిత సమస్య అని నిర్ధారణ అయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. సరైన సమయంలో చికిత్స అందితే మాత్రమే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిది.