ఇప్పుడు చెప్పబోయే విషయం మాంసాహార ప్రియుల్లో కొంత ఆందోళన, అసంతృప్తి కలిగిస్తుందని చెప్పొచ్చు. మాంసాహారం తీసుకుంటే సమృద్ధిగా ప్రోటీన్స్, విటమిన్స్ మినరల్స్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా లభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
అయితే తాజా పరిస్థితుల దృశ్య మాంసాహారాలైన
చికెన్,మటన్ ఎక్కువగా తినేవారిని ప్రమాదకర సూపర్ బగ్ ప్రమాదం వెంటాడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిజానికి సూపర్‌బగ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. కొన్ని బ్యాక్టీరియా మనకు మేలు చేస్తే కొన్ని హాని చేస్తాయి.ఇది పరాన్నజీవి జాతిగా చెబుతారు. శరీరంలో దానిసంఖ్య పెరిగినప్పుడు యాంటీబయాటిక్పై ప్రభావం పడుతుంది. దీనిని యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ స్థితి అంటారు
ఈ పరిస్థితి గల కారణాలను పరిశీలిస్తే గత మూడు సంవత్సరాలుగా కరోనా తీవ్రత నుండి రక్షణ పొందడానికి యాంటీబయాటిక్స్ మందులను ప్రతి ఒక్కరు ఎక్కువగా వినియోగించారు. దానికి తోడు మనం మాంసంగా వినియోగించే కోళ్లు లేదా ఇతర జంతువులకు త్వరగా ఎదగడానికి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు, టైలోసిన్ అనే డ్రగ్ వాడుతున్నట్లు పరిశోధనలో తేలింది. మనకు తెలియకుండా వీటి మాంసం తినడం వల్ల మోతాదుకు మించి యాంటీబయాటిక్స్ మన శరీరంలోకి చేరుతున్నాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధికారకాలపై సమర్థవంతంగా పనిచేయడం మానేస్తాయి.ఇలాంటి సమయంలో చిన్న ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకంగా మారుతుంది.
కావున ఇలాంటి సమయాల్లో యాంటీబయోటిక్ డ్రగ్స్ వినియోగించిన మాంసాహారాన్ని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అత్యధిక ప్రోటీన్స్ కలిగిన పన్నీర్, పాలు, గుడ్లు,చేపలు, బాదం పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.