సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల అయ్యింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం, సినిమా బాగుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
ఇక ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకుందని ట్రేడ్ లో తేల్చారు. మరో ప్రక్క సినిమాకు టాక్ బాగుండటం వల్ల డిజిటల్ ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా భారీగా పలికాయి. డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్లు 8 కోట్లకు కొన్నారని టాక్. బయోపిక్ సినిమాకు స్టార్ సినిమా రేంజ్ డిజిటల్ రైట్స్ అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది.
మరో ప్రక్క శాటిలైట్ రైట్స్ కూడా దాదాపు ఇదే రేంజ్ లో అమ్ముడవుతానటంలో సందేహం లేదు. సో ఎలా లేదన్నా యాత్ర నిర్మాతలకు బిజినెస్ తో సంబంధం లేకుండా ఈ రైట్స్ రూపంలోనే మొత్తం బడ్జెట్ రికవరీ అవుతుంది. మిగతాదంతా మిగులే.
ఇక బిజినెస్ గురించి విన్న ఎన్టీఆర్ కథనాయకుడు టీమ్ కు మండుకొస్తోందని చెప్పుకొస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన తమ సినిమాకు డిజిటల్ రైట్స్ విషయంలోనూ నిరాశ ఎదురైందని వార్త. దాంతో యాత్ర గురించి వస్తున్న వార్తలు బాధ కలిగిస్తూంటాయి. అది మానవ సహజం.