అమెరికాలో చెప్పు దెబ్బలు తిన్న తెలుగు కమిడయన్

నిన్నటి నుంచి ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..తెలుగులో వెలుగుతున్న ఓ స్టార్ కమిడియన్ ఒకతను అమెరికాకు ఓ ఈవెంట్ నిమిత్తం వెళ్లి చేసిన వెధవ పనికి చెప్పుదెబ్బలు తిన్నాడని. అయితే ఆ కమిడియన్ ఎవరనేది ఎవరూ రివీల్ చేయటం లేదు. ఎవరికి తోచింది వారు ఊహిస్తున్నారు.

మీడియాలో వచ్చిన వార్త ఏమిటంటే…అమెరికాలో భారీ ఎత్తున జరుగుతున్న తానా సభలకు చాలా మంది సినిమావాళ్లు వెళ్లారు. వాళ్లలో ఓ కమిడియన్ ని సైతం ఉన్నారు. ఆయనకు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన బుద్ది తిన్నమైనది కాదు అని, ఆయనతో పరిచయం ఉన్నవాళ్లందరికీ తెలుసు. అమ్మాయి కనిపిస్తే వయస్సు తో సంభందం లేకుండా వెంటబడతాడు. ఏదన్నా అంటే సరదాగా జోక్ వేసా అని తప్పించుకోచూస్తాడు.

అయితే ఈ విషయం సినిమా వాళ్లకు తెలుసుకాబట్టి ఆయనతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆడవాళ్లు కాస్తంత దూరం పెడుతూంటారు. కానీ అమెరికాలో ఉన్న ఫ్యాన్స్ కు ఏం తెలుసు. ఆయన్ని సినిమాలు చూసి బయిట కూడా అంతే ఫన్నీగా ఉంటాడని భావించి, కాస్త చనువు ఇచ్చారు. అది ఆయన అమాంతం అపార్దం లాంటి అర్దం చేసుకుని, చనువును మరింత కొనసాగించి చెయ్యేసారు. ఈవెంట్ కు తీసుకువెళ్తున్న కారులో జరిగిన సంఘటన ఇది.

మొదట క్యాజువల్ గా పడింది అనుకున్నా..అరక్షణంలో అర్దమై ఆయన్ని ఆమె ఓ పీకు పీకింది. అంతే కారు ఆగింది. ఆమెకు సంభందించిన మరో నలుగురు పోగయ్యి..ఓ రౌండ్ వేసారు. అంతేకాదు జైల్లో వేసేద్దామని కొందరు ప్రపోజల్ సైతం పెట్టారు. అయితే ఈవెంట్ కు వచ్చి ఇలా ఇరుక్కుపోయాడనే బ్యాడ్ నేమ్ ఎందుకుని ఆగారట. అందులోనూ ఈ ఈవెంట్ కు హాజరైన మరికొందరు వదిలేయమని అన్నారట. ఇప్పుడు ఆ కమిడయన్ తన గురించి వార్తలు మీడియాలో రాకుండా మ్యానేజ్ చేసే పనిలో ఉన్నారట అదీ విషయం. ఇంతకీ ఆ కమిడియన్ ఎవరో ఐడియా వచ్చిందా. ..