‘అర్జున్‌ రెడ్డి’ని చూసి సిగ్గుపడాలి:విజయ్‌ దేవరకొండ

రౌడీ స్టార్ కి చీవాట్లు.. అంత త‌ప్పేం చేశాడ‌ని?

విజయ్ దేవరకొండ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవటమే కాకుండా దేవరకొండ నటనకు మంచి పేరు తెచ్చి పెట్టింది, నటుడుగా మరో మెట్టు ఎక్కించింది. ‘అర్జున్‌ రెడ్డి’ప్రస్తావన లేనిదే దేవరకొండ కేరీర్ గురించి మాట్లాడలేని సిట్యువేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ ఇంకా గర్వపడుతున్నారా..ఆయన ఏమనుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది, దేవరకొండ ను ప్రేరణగా తీసుకోవాలనిపిస్తుంది. రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ దిన పత్రికతో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు విభిన్నం గా స్పందించారు.

‘మీరు ప్రతి సినిమాకు మీ నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ విషయంలో మీకు పర్శనల్ గోల్స్ ఉన్నాయా?’ అని ప్రశ్నిస్తే… దీనికి విజయ్‌ సమాధానమిస్తూ.. నా సినీ కెరీర్‌లోనే సూపర్‌ హిట్‌గా చెప్పుకునే ‘అర్జున్‌ రెడ్డి’ని కొన్నేళ్ల తర్వాత తను చూసినప్పుడు సిగ్గుపడాలని, నటుడిగా ఆ స్థాయికి ఎదగాలని చెప్పారు.

‘‘మరికొన్నేళ్లు తర్వాత కూడా తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’ నా ఉత్తమ చిత్రం అని చెప్పుకుంటే దానర్థం నేను ఎదగడం లేదని. ఈ వృత్తిలో నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి సినిమాకు ది బెస్ట్‌గా అవ్వాలనేది నా ఉద్దేశం. నేను చూసి ఎంజాయ్‌ చేసేలా ఉండే చిత్రాల్ని చేయాలని ఉంది’ అని ఆయన చెప్పారు.

తన తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా గురించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా విషయంలో నేను చాలా ఎక్సైటైంగ్ గా ఉన్నాను. ఇందులో నేను స్టూడెంట్ పాత్రను పోషించా. కొత్త దర్శకుడు భరత్‌ కమ్మా తీసిన న్యూఏజ్‌ లవ్‌ స్టోరీ ఇది. బిగ్ స్క్రీన్ పై ఈ కథ చూడటానికి వండర్ ఫుల్ గా ఉంటుంది. నా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ జులై 26న సినిమాను రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలోని రెండో పాటను మే 15న ఉదయం 11.11 గంటలకు విడుదల చేయబోతున్నారు.