రూ.40 కోట్ల ఆఫర్ రిజక్ట్ చేసిన దేవరకొండ?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ రైట్స్ ని బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఇప్పటికే సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఇటీవల ఆయన ముంబైలో విజయ్‌ను కలిశారు. ఈ సినిమా అందమైన ప్రేమకథని ట్వీట్ చేశారు. అయితే కరణ్ కేవలం రైట్స్ కోసం మాత్రమే విజయ్‌ను కలవలేదని తెలుస్తోంది.
ఈ సినిమాతో ఆయన్ను హీరోగా బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకున్నారట. అందుకే విజయ్‌కు రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ‘అర్జున్ రెడ్డి’ దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే.. విజయ్, కరణ్ స్పందించాల్సిందే.
ఇక గతంలో ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ కోసం ముందు విజయ్‌నే సంప్రదించారు. నటించిన పాత్రలోనే మరోసారి నటించనని ఆయన చెప్పినట్లు తెలిసింది. హిందీ చిత్రాల్లో నటించడం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో నటించడం నాకూ ఇంట్రస్టే . కానీ నా సినిమా టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఒకేసారి రావాలనుకుంటున్నా.
నా స్నేహితులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉండగా.. నేను ముంబయిలోని అపార్ట్‌మెంట్‌కి షిఫ్ట్ కావడం నాకు ఇష్టం లేదు. నాకు లేజీ లైఫ్‌స్టైల్ అంటే ఇష్టం. ఒకేరోజు ఎక్కువ మందితో కలిసి పనిచేయలేను. నా ఆలోచనలు కాస్త నెమ్మదిగా ఉంటాయి.. ముంబయి వేగానికి నేను సరికాను. నాకు ఏదైనా సరే స్వతహాగా చేయడం ఇష్టం’ అని అన్నారు.