ఈ మధ్యన ప్రతీ ఇంటర్వూలోనూ తమన్నా ..సెక్స్ గురించి ఉపన్యాసాలు దంచేస్తోంది. ఇదేంటి హఠాత్తుగా సెక్స్ మీద పడింది ఈ సుందరి అని షాక్ అవటం ఆమె అభిమానుల వంతైంది. అయితే ఆమె ఇలా మాట్లాడటం వెనక ఓ రీజన్ ఉంది. అది ఆమె తాజా చిత్రం నెక్ట్స్ ఏంటి ప్రమోషన్ కోసం. ఎంత ప్రమోషన్ కోసం అయినా పదే పదే తమన్నాలాంటి హోమ్లీ గర్ల్ అదే పనిగా సెక్స్ గురించి మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పండి. అదే ఫీలవుతుున్నారు ఆమె అభిమానులు.
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి బాహాటంగా మాట్లాడి తమన్నా హాట్ టాపిక్ అయింది. “నెక్ట్స్ ఏంటి” చిత్రం ..లవ్ , సెక్స్ చుట్టూ తిరిగే కథ కావటంతో ఈమె ప్రమోషన్ లో భాగంగా సెక్స్ గురించి లెక్చర్స్ ఇచ్చేస్తోంది. అక్కడితో ఆగకుండా అమ్మాయిలు సెక్స్ గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నిస్తోంది తమన్నా. అసలు మన సమాజంలో అమ్మాయిలు సెక్స్ గురించి కానీ.. సెక్సువల్ విషయాలు కానీ మాట్లాడితే ఎందుకు తప్పుగా చూస్తున్నారంటూ ప్రశ్నలు సైతం వేస్తోంది ఈ మిల్కీబ్యూటీ.
సినిమాని ప్రమోట్ చేసుకోవటానికైనా ఓ హద్దు ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడేసి సినిమాపై హైప్ తెచ్చేయలని చూడటం అవివేకం. ఎందుకంటే థియోటర్ దాకా వెళ్లిన ప్రేక్షకుడుకి ఆ కంటెంట్ దొరక్కపోతే ..డైరక్టర్ దొరికిపోతాడు. సినిమా ఫ్లాఫ్ అని అనేస్తారు. ఇప్పుడదే పరిస్దితి ఎదురౌతోంది. సందీప్ కిషన్, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘నెక్స్ట్ ఏంటి?’ సినిమాకు.
రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రైనా జోషి, అక్షయ్ పూరిలు సంయుక్తంగా నిర్మించారు.
సందీప్ కిషన్, తమన్నా జంటగా, నవదీప్, పూనమ్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మించారు.