సుడిగాలి సుధీర్ కు ఏం సమస్య వచ్చిందా రా బాబు .!

సుడిగాలి సుధీర్  పేరు వినగానే మన పెదాలపై చిరు నవ్వు వస్తుంది.  ఈటీవిలో వచ్చే  జబర్దస్త్  తో పరిచయమైన సుడిగాలి సుధీర్ బుల్లితెరపై తనదైన శైలిలో నవ్విస్తూ మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. షార్ట్ పీరియడ్ లోనే పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ ప్రక్కన జబర్దస్ మరో ప్రక్క  కొన్ని  ప్రోగ్రాం లలో యాంకర్‌గా చేస్తూనే, సినిమాలలో కూడా నటిస్తున్నాడు. 

 ఈవెంట్‌లైనా, ఎలాంటి ప్రోగ్రాంలైనా సుధీర్ మొదట ఆప్షన్ గా ఉంటున్నారు. కేవలం నవ్వించటమే కాకుండా మ్యాజిక్, డ్యాన్స్, సింగింగ్ వంటి కళలను బయిటకు తీసి  ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే సుధీర్ కి ఊహించని సమస్య వచ్చి పడింది. కేవలం నవ్వించటం కోసం స్క్రిట్ లలో ప్లే బోయ్ గా క్రియేట్ చేసారు. మిగతా క్యారక్టర్స్ ఆ విధంగా పంచ్ లు వేస్తూ ఆ ఇమేజ్ ని సుస్దిరం చేసేస్తున్నారు. ఇప్పుడు అదే ఇమేజ్ తన పర్శనల్ లైఫ్ కు ఇబ్బందిగా మారిందని బాధపడుతున్నాడట.

 నవ్వించడానికి మాత్రమే చేసిన స్క్రిట్ లలో కామెడీని  ప్రేక్షకులు మాత్రం అవి నిజమనే అనుకుంటున్నారు. దాంతో  సుధీర్ ఏదైనా ఈవెంట్ కి హాజరైనా, ఎక్కడికైనా వెళ్ళినా జనాలు అతడిని  అనుమానంగా చూడడం మొదలుపెట్టారట. కొందరైతే కొద్దిగా పరిచయమయ్యాక మెల్లిగా నువ్వు ప్లేబోయ్ వి అంటగా అని డైరక్ట్ గా అడిగేస్తున్నారు. దాంతో తన నటన సక్సెస్ అయ్యినందుకు ఆనందపడాలో లేక అది పర్శనల్ లైఫ్ కు ఇంపాక్ట్ అవుతుందని బాధపడాలా అనేది అర్ధం కావడంలేదట.