ఈ టాపిక్ గత రెండు రోజులుగా వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ స్టార్ తెలుగు డైరక్టర్ గురించిన ఈ వార్త చాలా చర్చనీయాంశంగా మారింది. తన ముందు సినిమాలో నటించిన హీరోయిన్ అయిన బాలీవుడ్ భామతో ఎఫైర్ నడిపి..ఆమెను తిరిగి తన కొత్త చిత్రంలో కంటిన్యూ చేయమని హీరోపై ఒత్తిడి తెస్తున్నాడని ఆ వార్త సారాంశం.
అందులో ఎంతవరకూ నిజముందో కానీ ఈ వార్త మాత్రం సినిమా అభిమానుల్లో చర్చనీయాశంగా మారింది. ఆ కథనాలు రాసిన వారు ఇచ్చిన క్లూ లు ప్రకారం ఆ దర్శకుడు ఇంతకు ముందు మెగా హీరోలతో పనిచేసారట. అలాగే స్టార్ డైరక్టర్. తన స్క్రిప్టులు డైలాగులతో సహా తనే రాసుకుంటారు. ఆ డైలాగులతోనే స్టార్ ఇమేజ్ వచ్చింది. వీటిన్నటిని బట్టి అతను ఎవరనేది గెస్ చేయమంటున్నారు. అలాగే ఆ హీరోయిన్ కూడా స్టార్ గా వెలిగిపోతోందిట. ఆమె ఈ ఎఫైర్ కు అడ్డు పెట్టటం లేదట. ఇదంతా ఇండస్ట్రీలో కామన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తోందిట.
ఇక ఇలాంటి రూమర్స్ మీడియాలో అతి సామాన్యమే కానీ ఈ సారి ఈ రూమర్ మాత్రం కాస్త ఎక్కువే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కావాలని కొందరు దీన్ని ప్రమోట్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఆ డైరక్టర్ పై గతంలోనూ ఇలాంటి వార్తలు రావటం విశేషం.