సోషల్ మీడియాలో అమలాపై దుమారం!

 సోషల్ మీడియాలో అమలాపై దుమారం!

 
దశాబ్ద కాలంగా చిత్ర సీమలో కొనసాగుతున్న తార  అమలాపాల్  విషయంలో సోషల్ మీడియాలో రోజుకో  పుకారు షికారు చేసుకుంటోంది. ఉన్నది లేనట్లుగా.. లేనిదీ ఉన్నట్లుగా ఆమె గురించి ఇష్టమొచ్చిన రీతిలో ఎవరికీ తోచింది వారు  తెగ పోస్టులు పెడుతూ అమలాపాల్ ను నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న అమలా ప్రారంభంలో వాటిని తేలిగ్గానే తీసుకుంది. అయితే ఇలాంటి పోస్టులు మరీ శృతిమించడంతో ఇక లాభం లేదనుకుంది. వెంటనే స్పందించాలనుకుంది,  నెటిజన్ల సూటి పోటీ మాటలకూ తనదైన రీతీలో సమాధానాలు పోస్ట్ చేస్తూ వారిని ఓ ఆటాడుకుంటోంది.
 
ఇంతకీ నెటిజనుల పోస్టులేమిటో  తెలుసా? భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ నిర్మాతలను తెగ ఇబ్బందికి గురిచేస్తున్నదని!  ఈ పోస్టుకు ఈ ముద్దు గుమ్మ  సమాధానమిస్తూ –  భారీ పారితోషికమన్నది ఒట్టి మాట. కావాలనే నాపై కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తూ నా కెరీర్ ని దెబ్బ తీయాలనుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కాదు చిత్రసీమకు చెందినవారేనని వేరే చెప్పనక్కరలేదు. విజయ్ సేతుపతి  హీరోగా  కృష్ణన్ దర్శకత్వంలో చంద్ర ఆర్ట్స్ పతాకంపై తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తొలుత నన్ను హీరోయిన్ గా బుక్ చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో.. నా స్థానంలో మరొకరిని ఎంపిక చేసుకున్నారు. నేను ఈ విషయాన్నీ తేలిగ్గానే తీసుకున్నాను.
 
అయితే కొంతమంది కావాలని నేను  భారీ పారితోషి కాన్ని డిమాండ్ చేయడం వల్లే నన్ను ఆ సినిమాలోంచి తీసేశారని ప్రచారం మొదలు పెట్టారు.  నేనేమిటో చిత్ర సీమలో అందరికీ తెలుసు. ఇప్పటివరకు నాపై ఎలాంటి ప్రచారాలు జరగలేదు. నేను నిర్మాణ సంస్థలకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాను. ఎలాంటి అసత్య ప్రచారాలు చేసే నిర్మాణ సంస్థల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. అప్పుడే పరిశ్రమ పచ్చగా వర్ధిల్లుతుంది అంటూ అమలాపాల్ తన మనసులోని మాటలను తెగేసి చెప్పేసింది దటీజ్ అమలాపాల్!