దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసుకున్న సంచలనంగా మారింది. ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు . వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే అసలు విషయం మాత్రం వై.ఎస్.జగన్ ప్రభుత్వం రావడమే అందరికీ అర్దమైంది.
దర్శకేంద్రుడుగా సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన రాఘవేంద్రరావు తెలుగుదేశం పార్టీకు మొదటి నుంచీ సపోర్టర్. చంద్రబాబు కాలంలో తెలుగుదేశం పార్టీకి యాడ్స్ తీసి తన వంతు ప్రచారం చేసారు. అందుకు మెచ్చి చంద్రబాబునాయుడు ఇచ్చిన నామినేటెడ్ పదవి ఇది. కాబట్టి వెంటనే రాజీనామా చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో నామినేట్ అయిన పదవులకు రాజానామా పర్వం మొదలైంది.
సాధారణంగా ముఖ్యమంత్రి మారగానే అధికార పక్షానికి ఇష్టం లేని వారిని మార్చేయడం జరుగుతుటుంది. తమకు అనుకూలంగా వారిని రిక్రూట్ చేసుకోవడం సహజం. ఈ విషయాన్ని ముందే గ్రహించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంచలన నిర్ణయం తీసుకుని టీడీపీ బోర్డు సభ్యత్వం నుంచి తప్పుకున్నట్లు వినికిడి.
అయితే అర్జెంటు గా రాజీనామా చేయటానికి కారణం…మంగళవారం టీడీడీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఆ సమావేశంలో అన్ని వివరాలు దర్శకేంద్రుడు వివరించనున్నారు. అలాగే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లగా నటి పూనమ్ కౌర్ ను, పుష్కరాలు ప్రచాకర్త అయిన దర్శకుడు బోయపాటి శ్రీను త్వరలోనే వాళ్లు కూడా రాజీనామాలు చేసే అవకాశం కనిపిస్తోంది.