రకుల్ డిమాండ్ కు షాక్ అయిన కమల్

రకుల్ డిమాండ్ కు షాక్ అయిన కమల్

స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలుతున్న రకుల్ ప్రీతి సింగ్ సరైన హిట్ కాస్త వెనకబడింది. అయితే తన సినిమాలు ఫ్లాఫ్ కావచ్చేమో కానీ తను కాదు అంటుంది. అంటే ఫరవాలేదు తను తీసుకునే రెమ్యునేషన్ విషయంలో ఏ మాత్రం మొహమాట పడదు. తను చెప్పిన రేటు ఇస్తేనే సై అని సైన్ చేస్తుంది. అయితే కుర్ర హీరోలు ఈ విషయం గమనించి లైట్ అని ప్రక్కన పెట్టిన సీనియర్ హీరోలకు రకుల్ లాంటి హీరోయిన్ ఆప్షన్ దొరక్క సరే అంటున్నారు.

ఆ మధ్య దిల్ దే ప్యార్ దే లో అజయ్ దేవగన్ సరసన చేసిన నాటి నుంచి ఆమెకు వరసపెట్టి సీనియర్ హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మన్మధుడు 2 చిత్రం చేసింది. ఆ సినిమా కి సైతం ఆమె కోటిన్నర రెమ్యునేషన్ డిమాండ్ చేసిందని వినికిడి. అయితే నాగార్జున లాంటి సీనియర్ హీరో సరసన చేయాలంటే హీరోయిన్స్ దొరకటం కష్టం కాబట్టి ఓకే అనుకుని ముందుకు వెళ్లిపోయారు టీమ్.

ఇప్పుడు కమల్ హాసన్ తో ప్రముఖ దర్శకుడు శంకర్ చేద్దామనుకుంటున్న ఇండియన్ 2 సినిమాకు సైతం రకుల్ కు కీలకమైన పాత్ర అనుకున్నారట. ఆ పాత్ర విషయమై కమల్ ..స్వయంగా రకుల్ తో మాట్లాడి ఒప్పించారట. అయితే ఆమె తనకు కోటిన్నర రెమ్యునేషన్ ఇస్తే ఏ సమస్యా లేదని తేల్చి చెప్పిందిట. తన కెరీర్ లో ఎవరు తనతో చేయటానికి ఇంతలా రెమ్యునేషన్ విషయంలో పట్టు పట్టలేదని కమల్ వాపోయారట. దాంతో ఇప్పుడు ఆమెను తీసుకోవాలా వద్దా అనే విషయమై టీమ్ మల్లగుల్లాలు పడుతోందిట.