బూతు జోక్స్ కు ప్రభాస్ బలయ్యాడా?

‘బాహుబలి’ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమా దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ లోనూ దుమ్ము రేపింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళికి మంచి పేరు ప్రతిష్టలు దక్కాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌ స్టార్‌డమ్‌ ఇంటర్నేషనల్ స్దాయిని టచ్‌ చేస్తే, ప్రధాన పాత్రలు చేసిన రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అనుష్క, తమన్నాల నటనకు సినీ లోకం ఫిదా అయ్యింది.

బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన టాప్‌ 5 సినిమాల్లో ‘బాహుబలి’ నిలిచింది. అలాగే ‘బాహుబలి’ సినిమాను హిందీలో కరణ్‌ జోహార్‌ డిస్ట్రిబ్యూట్‌ చేశారన్న విషయం తెలిసిందే. ఈ నేఫద్యంలో రాజమౌళి, ప్రభాస్, రానా లకు ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో నుంచి పిలుపువచ్చింది. అయితే ఇక్కడే ప్రభాస్ ..ఇరుక్కుపోయాడా అంటున్నారు.

ముంబైలో దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా చేసే ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షో చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ షోలో స్పెషాలిటీ ఏమింటంటే అడల్ట్స్ జోక్స్. మరీ పర్శనల్ విషయాలు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రెటీలు ఈ షోకు వెళ్లి మింగలేక..కక్కలేక అన్న పరిస్దితి తెచ్చుకున్నారు. కరణ్ జోహార్ వంటి పెద్ద నిర్మాత,దర్శకుడు ని ఎదురు ప్రశ్నించి..ఆపమనలేరు.

నవ్వుతూ ఏదో ఒకటి చెప్తూ దొరికిపోతూ వస్తున్నారు. అయితే ఇది బాలీవుడ్ లో చాలా కామన్ థింగ్ గా అక్కడ మీడియా పరిగణిస్తుంది. అయితే ఇప్పుడు మన ప్రభాస్ ఆ షోకు గెస్ట్ గా వెళ్లారు.

రాజమౌళి, ప్రభాస్, రానా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో కోసం ఒకే వేదికపైకి వచ్చారు. అక్కడ కరణ్ జోహార్ ఎప్పటిలా ..అడల్ట్ డైలాగులతో ప్రభాస్ ని ఆటపట్టించాడని, రానా ని కూడా కొన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగారని సమాచారం. త్వరలో ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుందట. .