పోసాని ఆపరేషన్ ఫెయిలైందా? మళ్లీ హాస్పటిల్ లో

పోసాని ఆపరేషన్ ఫెయిలైందా? మళ్లీ హాస్పటిల్ లో …

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, రాజకీయ విమర్శకుడు పోసాని కృష్ణ మురళి కీళ్లకుసంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆ మధ్యన హైదరబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న పోసానికి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అయితే అది సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాత ఆయన రీసెంట్ గా హెర్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయినట్లు మడీియాలో వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ జరిగిన చోట ఇన్ఫెక్షన్ వచ్చినట్లు చెప్తున్నారు. దాంతో పోసాని మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు సమాచారం . ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా మరోసారి హెర్నియా ఆపరేషన్ జరిపినట్లు, ఒకట్రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. కేవలం మీడియాలో మాత్రమే వార్తలు వస్తున్నాయి. దీనిపై పోసాని కోలుకుని స్పందిస్తారని ఆశిస్తున్నారు.