పృథ్వీ నోరు జారి కామెంట్,ఇరుక్కుపోయాడా ?

పృథ్వీ నోరు జారి కామెంట్,ఇరుక్కుపోయాడా ?

ఎలక్షన్స్ పుణ్యమా..సినిమా వాళ్లు సైతం రాజకీయాల్లోకి వచ్చారు. యాక్టివ్ గా ఉంటున్నారు. అంతటితో ఆగకుండా తమ బ్రతుకు తెరవు అయిన సినిమా పరిశ్రమనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక్కోసారి ఆ వివాదంలో తాము ఇరుక్కుపోతున్నారు. ఇప్పుడు కమిడయన్ ఫృద్వీ పరిస్దితి అదే. ఆయన నోరు జారి కామెట్ చేసాడని పోసాని అనటం అందుకు నిదర్శనం.

ఆంధ్రప్దదేశ్ లో వైఎస్ జగన్ సీఎం కావడం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇష్టం లేదని ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ రీసెంట్ గా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన వ్యక్తి, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వీరాజ్ తొందరపడి ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమ పెద్దలకు ఇష్టం లేదన్న వ్యాఖ్యలు “బిగ్ మిస్టేక్ “గా అభివర్ణించారు.

సీఎం అయిన జగన్ ని కలిసి, ఓ పూల దండ వేసి, అభినందిస్తే, ఆయనపై ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకుంటే పొరపాటేనని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని, అప్పుడు తానేమి చంద్రబాబును కలిసి అభినందించలేదని, అంటే, చంద్రబాబు సీఎం కావడం తనకు ఇష్టం లేదని అనుకోవడం కరెక్టు కాదు అని అన్నారు. ఇప్పుడు ఫృద్వీకు ఇండస్ట్రీలో చాలా మంది శత్రువులు తయారయ్యారు.