‘భీష్మ’లో నితిన్ క్యారక్టర్, స్టోరీ లైన్

‘భీష్మ’లో నితిన్ క్యారక్టర్, స్టోరీ లైన్

‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మండన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం స్టోరీలైన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నితిన్ …ఆడవాళ్లకు ఆమడ దూరం ఉండే పాత్రలో కనిపిస్తారు. పెళ్లి అన్నా,రిలేషన్ షిప్ అన్నా పడదు. అందుకు బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రష్మిక పాత్ర అయితే ఓ టీచర్. నితన్ కు పాఠాలు, ఆ తర్వాత ప్రేమ పాఠాలు చెప్తుంది. సినిమాలో మెయిన్ ఎపిసోడ్ ఇదేట. అదే సస్పెన్స్ అంటున్నారు. అలా భీష్ముడుగా జీవితాంతం మిగిలిపోదామనుకున్న నితిన్ ..మనస్సు మార్చుకుని తిరిగి మామూలు మనిషి ఎలా అయ్యాడు. రిలేషన్ షిప్ లో ఎలా ప్రవేశించాడు అనేది మిగతా కథ అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్‌ శుక్రవారంతో ముగిసింది. ఈ షెడ్యూల్‌ 25 రోజుల పాటు సాగింది. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాని తెలిసింది. అలాగే ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ ఆగస్టు 16న ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘ఎప్పటికీ సింగిల్‌గా ఉంటానని ‘భీష్మ’ అంటున్నాడు. నితిన్‌ గత ఏడాది ‘ఛల్‌ మోహన్‌రంగ’, ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా మొన్నే విడుదలకు అయ్యింది. మరోపక్క ఆమె కార్తికి జోడీగా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు.