నాగ్ కు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ?

నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారా…ఇదే టాక్ సినీ, రాజకీయ వర్గాల్లో గత రెండు రోజులుగా నలుగుతోంది. ఆయన ఎంపిగా ఎలక్షన్స్ లో నిలబడబోతున్నారని చెప్పుకుంటున్నారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాగార్జున ఆయనతో క్లోజ్ గా మెలిగేవారు. అంతేకాక నాగార్జున బిజినెస్ కు కొన్ని బెనిఫిట్స్ కూడా చేసాడని చెప్పుకున్నారు. అలాగే కాంగ్రేస్ పార్టీ తరుపున నిలబడమని వైయస్ అడిగారని, కానీ ఊహించని విధంగా వైయస్ మృతి చెందటంతో ఆ ప్రపోజల్ అటకెక్కింది.

కానీ ఇప్పుడు వైయస్ ఆ విషయాన్ని గుర్తు చేసి …నాగార్జున ని గుంటూరు జిల్లా నుంచి ఎంపిగా నిలబడమని కోరినట్లు సమాచారం. ఆ విధంగా తమ పార్టీకి సిని గ్లామర్ యాడ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే నాగార్జున తాను వరస ప్రాజెక్టులు కమిటయ్యానని, రాజకీయ ప్రవేశం పై కొంత ఆలోచించుకునే సమయం కావాలని కోరినట్లు చెప్పుకుంటున్నారు.

అయితే నాగార్జున సన్నిహితులు మాత్రం …ఆయన్ను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వెళ్లద్దని హెచ్చరిస్తున్నారట. ఓ పార్టీ తరుపున ఉంటే రకరకాల సమస్యలు వస్తాయని చెప్పారట. దాంతో అవకాసం ఉంటే వైయస్ జగన్ తరుపున ప్రచారంకి వెళ్ళటం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారట నాగ్. మరి జగన్ ఈ విషయమై ఎలా స్పందిస్తారో.