చంద్రబాబుని నెగిటివ్ గా చూపెడుతున్నట్లు బిల్డప్

‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లోని రెండో భాగమైన ‘మహానాయకుడు’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ మేకింగ్‌ వీడియోలను, ప్రోమోలను విడుదల చేసింది. అయితే పాజిటివ్ ప్రోమోలతో పెద్దగా ఒరిగేది ఏమీ లేదని టీమ్ కు అర్దమైనట్లుంది. దాంతో రానా చేస్తున్న చంద్రబాబు పాత్రను నెగిటివ్ అన్న అర్దం వచ్చేలా ప్రోమోలు , పోస్టర్స్ డిజైన్ చేసారు.

అయితే సినిమా తీస్తోంది బాలకృష్ణ..అదీ తెలుగుదేశం ప్రమోషన్ కోసం. అలాంటప్పుడు చంద్రబాబుకు వ్యతిరకంగా ఎందుకు సీన్స్ ఉంటాయి…ఆ మాత్రం జనాలకు తెలియదా..ఇలా టీజర్ లో నెగిటివ్ గా చంద్రబాబుని చూపితే…ఓపినింగ్స్ అదిరిపోతాయని టీమ్ ప్లాన్ అని తెలుస్తోంది. తాజాగా సినిమాలో రానా పాత్రకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది.

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా.. ఎన్టీఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించారు. సినిమా కోసం రానా.. చంద్రబాబులా ఎలా మారారు? ఎలాంటి మేకప్‌ వేశారు? తదితర విషయాలను ఈ వీడియోలో చూపించారు.

Rana Daggubati as Nara Chandrababu Naidu - #NTRMahanayakudu

రానా.. చంద్రబాబులా మారడానికి ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు కూడా మేకప్‌ విషయంలో సాయం చేశారు. చంద్రబాబు మేనరిజాన్ని రానా అనుకరిస్తున్నట్లు కనిపించారు. ‘మహానాయకుడు’లో రానా పాత్రే కీలకమని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెప్తూ వస్తోంది.