నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో తుగ్లక్ గా కనిపించనున్నారు. అవును…మీరు విన్నది కరెక్టే ఆయన తన తదుపరి చిత్రానికి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకుంటున్నారు. రీసెంట్ గా విడుదలై మంచి హిట్టైన 118 రిలీజ్ కు ముందే ఓకే చేసిన కథ ఇది. మల్లిడి వశిష్ట్ చెప్పిన కథను ఇప్పుడు పట్టాలు ఎక్కిస్తున్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది.
ఈ సినిమాలో ఇందులో మహ్మద్ బీన్ తుగ్లక్ కాలం నాటి పరిస్దితులను చూపెడతారు. తుగ్లక్ ని పిచ్చి తుగ్లక్ అని పిలిచేవారు. ఆయనే తిరిగి జన్మించటం వంటి ఎలిమెంట్ కథలో కలిసి ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తిగా ఫన్ , కొద్దిగా యాక్షన్ తో సినిమా ఉండబోతోంది. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్ ఈ సినిమా తన కెరీర్ కు పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.
అలాగే ఈ సినిమాను తన సొంత బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నే నిర్మిస్తారు. ఈ నెలలోనే ఈ సినిమాని లాంచ్ చేసే అవకాశం వుంది. సినిమాకు మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ ఎంపిక త్వరలో ప్రారంభం కానుంది. 118 అనంతరం పూర్తిగా డిఫరెంట్ ప్రాజెక్టులతో ముందుకు వెల్లాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యారు.
అలాగే ఈ చిత్రంతో పాటు దర్శకుడు శ్రీవాస్ చెప్పిన ఓ కథకు ఓకే చెప్పారు. హారిక హాసిని వారి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఈ సినిమాని కళ్యాణ్ రామ్ చేస్తారని తెలుస్తోంది.