కళ్యాణ్ రామ్ చేసిఉంటే హిట్ కొట్టేవాడ్ని

కథ రాసుకుంటున్నప్పుడు ఒక్కో హీరోని అనుకుంటారు డైరక్టర్. అయితే తనకున్న పరిచయాలు, అవసరాలు, అవకాశాలను బట్టి హీరోలని మార్చుకుంటూ వాళ్లకు తగినట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తూంటారు. ముఖ్యంగా కొత్త దర్శకులకు ఇది అనుభవమే.

ఎందుకంటే వారిని నమ్మి స్టార్ హీరోలెవరూ ఉత్సాహం చూపించరుగా. దాంతో మొదట తాము స్క్రిప్టు రాసుకునేటప్పుడు అనుకున్న హీరో..చివరకు తాము డైరక్ట్ చేసే హీరోకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. హిట్ అయ్యితే అందరూ హ్యాపీ..నో రిగ్రేట్స్. ఫ్లాఫ్ అయినప్పుడే బాధ అంతా. ఇప్పుడు కవచం దర్శకుడు పరిస్దితి అదేనట.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన కవచం సినిమా సబ్జెక్ట్ ముందుగా వెళ్లింది కళ్యాణ్ రామ్ దగ్గరికే. తాను స్క్రిప్టు రాసుకున్నప్పుడే కళ్యాణ్ రామ్ కు పెర్ ఫెక్ట్ గా వుంటుందని భావించి రాసుకున్నాడట. ఎలాగో తంటాలు పడి ..కళ్యాణ్ రామ్ దగ్గరకు ఈ స్క్రిప్ట్ ను డైరక్టర్ శ్రీనివాస్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కథ విన్న కళ్యాణ్ రామ్ మొదట యస్ అన్నా ఆ తర్వాత …నో అన్నాడట. ఎందుకు అనేది ఎవరికి తెలియదు. అప్పటికే ఓ పోలీస్ క్యారెక్టర్ చేయడం వల్లనో, లేదా స్క్రిప్ట్ నచ్చకపోవటం వల్లనో కావచ్చు. ఆ విషయాలేమీ డిస్కస్ చేయరు కదా.

దాంతో కవచం స్క్రిప్టు అక్కడి నుంచి బెల్లంకొండ కాంపౌండ్ కు వచ్చింది. ట్విస్ట్ లు అవీ బాగానే వున్నాయి.., పోలీస్ క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు కదా అని బెల్లంకొండ బాబు అటెంప్ట్ చేసాడు. కానీ రిజల్ట్ మాత్రం అంత ఆశాజనకంగా లేకపోయింది. దాంతో ఇప్పుడు ఆ దర్శకుడు అయ్యో..నా స్క్రిప్టు ని మొదట అనుకున్న కళ్యాణ్ రామ్ తో చేసినా బాగుండేదే అని దగ్గరవారిదగ్గర వాపోతున్నాడట.