ఇండస్ట్రీ టాక్ : ప్రభాస్ “ఆదిపురుష్” 500 కోట్ల భారీ డీల్ పై క్లారిటీ .!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఒక హైలీ అవైటెడ్ సినిమాగా అలాగే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర రాని స్థాయి భారీ విజువల్స్ ఉండే చిత్రంగా పరిగణిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించాడు.

మరి షూటింగ్ అంతా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. మరి ప్రభాస్ అయితే రామునిగా స్టార్ హీరోయిన్ కృతి సనన్ జానకి గా నటించారు. అయితే ఎలాగో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ లేటెస్ట్ గా కొన్ని షాకింగ్ గాసిప్స్ అయితే ఈ సినిమాపై వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి రికార్డు స్థాయిలో ఓటిటి ఆఫర్ ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చినట్టుగా గాసిప్స్ మొదలయ్యాయి. ఏకంగా 250 నుంచి 500 కోట్లు అంటూ ఇష్టమొచ్చిన ఫిగర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వీటిలో ఏది కూడా నిజం కాదు అన్నట్టుగా మన తెలుగు సినీ వర్గాల నుంచి సమాచారం.

ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని తెలుస్తుంది. ఇంకా ఓవర్సీస్ లో 35 కోట్ల డీల్ కే ఎవరూ ఈ సినిమాకి ముందుకు రాలేదు. అలాంటిది ఆల్రెడీ 500 కోట్లు కి లాక్ అయ్యింది అనే వార్త అయితే ఇప్పుడు అవాస్తవం అన్నట్టు సినీ వర్గాల నుంచి టాక్.