చూస్తూంటే మెగా క్యాంప్ పూర్తిగా ఫృధ్వీని దూరం పెట్టేసే పరిస్దితి కనపడుతోంది. ఆయన తన పార్టీ గెలిచిన ఆనందంలో అన్న మాటలే ఆయనకు చుట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మెగా క్యాంప్ నుంచే వచ్చే ఆఫర్స్ కు అడ్డుపడుతున్నట్లు సమాచారం. తన వృత్తిని మర్చిపోయి పార్టీ ప్రచారంలో ఆవేశంలో చాలా అనేసారు. ఇండస్ట్రీ వాటిని అన్నటిని గుర్తు పెట్టుకుంటుందని అనుకోలేదు.
అక్కడితో ఆగకుండా జగన్ గెలిచిన అనంతరం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ శుభాకాంక్షలు చెప్పలేదని మండిపట్టారు. పేర్లు పెట్టి మరీ ఘాటుగా విమర్శించాడు. పృథ్వీకి ఓ వైసీపీ అభిమాని పెట్టిన పొస్ట్ ను తన వాట్సప్ స్టేటస్ గా పెట్టాడు. అందులో చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబు లను ప్రస్తావిస్తూ చంద్రబాబు అదికారంలోకి రాగానే ఎదెరెళ్లి మరీ బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిన వైనాన్ని ఉదహరించారు.
ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల తీరును పరిశీలంచి ఎంబడగట్టాడు. బొడ్డు మీద బొప్పాయిలు కొట్టే రాఘవేంద్రరావుకు జగన్ గెలుపు కనిపించలేదా? స్వామి మాల ధరించి బాబాను ఆరాధించే సురేష్ బాబుకు విష్ చెయడం తెలియదా? ప‌్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన చిరంజీవికి జగన్ గెలుపు వార్త వినలేదా? అంటూ బాణాలు సంధించాడు.
అరవింద్ గారికి ఇంకా జగన్ గెలుపు వార్త ఎవరు చెప్పలేనట్లుంది అంటూ సెటెర్లు వేసాడు. అయినా జగన్ కి వీళ్ల అభినందనలు అవసరం లేదు. కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంగా మేము కోరుకుంటున్నామంతే. పరిశ్రమలో పెద్ద వాళ్లు కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు నా సినిమా కెరీర్ పై ప్రభావం చూపిస్తాయని తెలుసు. కానీ ఇక ఎవరి దయాదాక్షిణ్యాలు మీద ఆధారపడి బతకనని ఆవేశంగా మాట్లాడాడు పృథ్వీ.
ఇవన్నీ గమనించిన అల్లు అర్జున్ తన తండ్రి మీద తన మామయ్యల మీద మాట్లాడిన మాటలకు కోపం తెచ్చుకున్నారని వినికిడి. త్రివిక్రమ్ ని తన సినిమాలో ఫృధ్వీ ఉండటానికి వీల్లేదని అల్లు అర్జున్ అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా కనపడనున్నట్లు తెలుస్తోంది.