సినిమావాళ్లు మహా ముదుర్లు. ఎంత తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్ ఫుట్ వస్తుందా అని నిరంతరం ప్లాన్ చేస్తూంటారు. అందుకోసం రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తూంటారు. ముఖ్యగా రీమేక్ సినిమా చేస్తూంటే ఒరిజనల్ లో ఉన్న సీన్స్, షాట్స్ యాజటీజ్ కట్ అండ్ పేస్ట్ తరహాలో వాడేద్దామని ప్లాన్ చేస్తూంటారు. ఇప్పుడు బెల్లంకొండ తాజా చిత్రం రాక్షసుడుకు కూడా అలాంటిదే ప్లే చేస్తున్నారని వినికిడి.
వివరాల్లోకి వెళితే..బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు రమేష్ వర్మ ‘రాక్షసుడు’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘రాచ్చసన్’ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. రీసెంట్ గా సినిమా టీజర్ కూడా వచ్చింది.
అదేంటి సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఎక్కువరోజులు కాకుండానే అప్పుడే షూటింగ్ పూర్తి అవటం ఏమటి అని కొందరిని ఆశ్చర్యానికి గురిచేసి కూపి లాగితే అసలు విషయం బయిటపడింది. అదేమిటంటే..? ఈ సినిమాలో సగానికి పైగా సీన్లను ఒరిజినల్ సినిమా నుండి కట్ అండ్ పేస్ట్ చేసేసారట. వాటిని షూట్ చేయటం లేదట.
అంతెందుకు టీజర్ లో కనిపించిన కొన్ని షాట్స్ ఒరిజినల్ సినిమా నుండి తీసుకున్నవే అని తేలిపోయింది. ఇలా చేయటం కోసం ‘రాచ్చసన్’ సినిమాలో నటించిన కొందరు నటీనటులను రీమేక్ లో కూడా తీసుకున్నారు. వాళ్లతో హీరోకు ఉన్న కొన్ని సీన్స్ మాత్రమే షూట్ చేస్తున్నారట. మిగతావన్ని ఒరిజినల్ సినిమా నుండి తీసుకున్నారట. మొత్తానికి మంచి స్ట్రాటజీనే ప్లే చేస్తున్నారు. ఎంతవరకూ ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.