‘హైపర్ ఆది’ కు ‘జబర్దస్త్’ జీతం అంతేనా?

‘హైపర్ ఆది’ ఇచ్చేది ఎంతంటే…

జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షో ని హైపర్ ఆది ఎపిసోడ్ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ఏదన్నా వారం ప్రసారమైన ఎపిసోడ్‌లో హైపర్ ఆది లేకపోతే లోటు టీఆర్పీలలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతలా జనాల్లోకి వెళ్లిపోయాడు హైపర్ ఆది. అయితే ఇంత స్దాయితెచ్చుకున్న హైపర్ ఆది కు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు …జబర్దస్త్ కు ఓ క్రేజ్, యూట్యూబ్ లో విపరీతమైన డిమాండ్ తీసుకొచ్చిన హైపర్ ఆదికి, మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే కాస్త తక్కువ రెమ్యూనరేషన్ అంటున్నారు. వాళ్లు చెప్పే లెక్కల ప్రకారం హైపర్ ఆది కంటే చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ ఎక్కువ తీసుకుంటున్నారు.

చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ నెలకు 4 లక్షల రూపాయల వరకు జీతం అందుకుంటే…. అటు హైపర్ ఆదికి మాత్రం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఒక స్కిట్ కు ఇంత మొత్తం అంటూ రెమ్యునేషన్స్ గతంలో వీళ్లకు ఉండేవి. అయితే వద్దనుకుని అందరికీ నెలజీతం ఫిక్స్ చేసేశారు. కాస్త పేరున్న ఆర్టిస్టులంతా అటుఇటుగా రెండున్నర లక్షల జీతం తీసుకుంటున్నారని సమాచారం.

అలాగే అనసూయకు నెలకు 4 లక్షలు, రష్మికి 3 లక్షల రూపాయల ఇస్తున్నారట. ఇక జబర్దస్త్ లో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వ్యక్తి నాగబాబు. నాగబాబుకు నెలకు 20 లక్షల రూపాయలు, రోజాకు 15 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారని సమాచారం.