హీరో, హీరోయిన్ల రొమాన్స్‌ ఈ రేంజ్ లోనా?

యంగ్ హీరో నితిన్-రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం భీష్మ. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సినిమానుంచి ఇప్పటికే హీరో హీరోయిన్ల రొమాన్స్‌కి సంబంధించిన పోస్టర్లు సెన్సేషన్ అయ్యాయి.

కొద్దిరోజుల క్రితం బయటకు వచ్చిన సింగిల్స్ ఆంథమ్ సైతం సినిమాపై అంచనాలు పెంచింది. ఒంటరి కుర్రాడి తుంటరి వేషాలు కాన్సెప్ట్ తో సినిమాని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలో ‘నా లవ్ కూడా విజయ్‌మాల్యా లాంటిదిరా… కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అనే డైలాగ్ వైరలవ్వడం తెలిసిందే.

ఇదిలావుంటే, కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా భీష్మ టీం ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇది కూడా భీష్మ రేంజిని పెంచేదిలానే కనిపిస్తుంది. గొడుగు పట్టకుని రష్మికను పడేయడానికి తిప్పలు పడుతున్న నితిన్ కనిపిస్తున్నాడు. రష్మిక అప్పియరెన్స్, వెనక నితిన్ ఎక్స్‌ప్రెషన్ హైలెట్ అవుతున్నాయ. గొడుగు లవ్‌తో గాళ్‌ని లైన్‌లో పెట్టాడో లేదో తెలియాలంటే ‘భీష్మ’ చిత్రం కోసం ఎదురు చూడాల్సిందే!?