సీనియర్ హీరో కు సెట్టైన అమలాపాల్

అల్లు అర్జున్ తో చేసి సీనియర్ హీరో కి సై?

ఒకప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్ గా అమలా పాల్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్య వంటి స్టార్స్ సరసన చేసింది. అయితే వివాహానంతరం ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తమిళంలోనే సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అక్కడ కూడా గ్లామర్ తరహా పాత్రలు కాకుండా, నటనకి అవకాశం వున్న పాత్రలను మాత్రమే చేస్తోంది.

అయితే తాజాగా తెలుగు నుంచి ఆమెకి ఒక ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు రాజశేఖర్. రాజశేఖర్ కు వయస్సు పెరగటంతో ఆయన ప్రక్కన నటించటానికి హీరోయిన్స్ దొరకటం లేదు. మరీ చిన్న వయస్సు వాళ్లైతే రాజశేఖర్ ముందు తేలిపోతారు. ఆయన కూతుళ్లలా కనపడతారు. అలాగని ముదురు హీరోయిన్స్ ని పెడితే గ్లామర్ ఉండదు. ఈ క్రమంలో అమలా పాల్ కనపడింది.

ఇక కల్కి ఫ్లాఫ్ తర్వాత మరో సినిమాతో రెడీ అవుతున్నాడు హీరో రాజశేఖర్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అమలా పాల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. మొత్తానికి అమలా పాల్ ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేస్తుందన్న మాట.