మాసివ్ అప్డేట్ : “కల్కి 2898ఎడి” రిలీజ్ డేట్ లీక్.!

గత ఏడాదిలో మన తెలుగు సినిమా నుంచి అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద హీరోల సినిమాలు కానీ పాన్ ఇండియా సినిమాలు అయితే రాలేదు. కానీ ఈ ఏడాదిలో మాత్రం మళ్ళీ తెలుగు సినిమా సత్తా చాటే సమయం ఆసన్నం అయ్యింది. కాగా తెలుగులో అయితే ఈ రోజు “హనుమాన్” రిలీజ్ తో సెన్సేషనల్ ఓపెనింగ్స్ పాన్ ఇండియా మార్కెట్ లో స్టార్ట్ కాగా ఈ భారీ చిత్రం అనంతరం మరిన్ని సినిమాలు కొన్ని నెలల్లోనే వస్తున్నాయి.

కాగా ఈ చిత్రాల్లో అయితే ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్  అవైటింగ్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం విషయంలో రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ సెంటిమెంట్ గా ఫిక్స్ చేసారని ఇది వరకే తెలిపాము. కాగా ఇప్పుడు ఈ బిగ్ అప్డేట్ పై అధికారిక డేట్ లీక్ అయ్యిపోయింది.

నిజానికి ఈ అప్డేట్ ఈరోజు రావాల్సింది కానీ కొంచెం ముందే అయితే సోషల్ మీడియా ప్రపంచంలో లీక అయ్యింది. కాగా దీనితో ఈ సినిమాని చిత్ర బృందం అనుకున్నట్టుగానే తమ సెంటిమెంట్ డేట్ మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా లీక్ అయ్యింది. ఇదే మే 9న వైజయంతి మూవీస్ నుంచి జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఉండడంతో సెంటిమెంట్ గా ఈ డేట్ ని ఫిక్స్ చేసారని రూమర్స్ రాగా ఇపుడు ఇదే డేట్ తో కల్కి దర్శనం ఇచ్చాడు.

సో తెలుగు సినిమా నుంచి మరో సూపర్ హీరో రాబోతున్నాడు అని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ దీపికా పదుకొనె దిశా పటానిలు నటిస్తుండగా ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ లతో ఓ గ్రాండ్ మల్టీస్టారర్ సినిమాగా కూడా ఇది నిలిచింది. 
https://twitter.com/Tranquility_Lyf/status/1745651995183042965