‘సాహో’ : శ్రద్దా కపూర్ కు ఇచ్చింది అంత తక్కువా?

‘సాహో’ : శ్రద్దా కపూర్ కు రెమ్యునేషన్ ఎంత?

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సెటిల్ అయిన శ్రద్దా కపూర్ ‘సాహో’ సినిమాతో సౌత్‌లోనూ ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన సాహో ట్రైలర్,టీజర్‌లలో శ్రద్దా నటనకు మంచి క్రేజే వచ్చింది. ప్రభాస్ కటౌట్‌కి తగ్గ అందం అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. శ్రద్దా నటనకి,ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఆమె ఎంత రెమ్యునేషన్ తీసుకుని ఉంటుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

అమృతా నాయర్ ..క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించే శ్రద్దా ఈ సినిమా కోసం చాలా డేర్ డెవిల్ స్టంట్స్ చేసింది. యాక్షన్ రోల్ లో అదరకొట్టింది. ఇంత కష్టానికి ఫలితం దక్కిందా. 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న చిత్రం పదే పదే చెప్పబడుతున్న ఈ సినిమాకు ఆమెకు ఏడు కోట్ల ఇచ్చారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమేనా అంటే అంత లేదు కేవలం ఆమెకు ముట్టింది మూడు కోట్లే అని తెలుస్తోంది.

ఏడు కోట్లు అంటూ బాలీవుడ్ మీడియా ఆమెకు హైప్ చేసిందని చెప్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసుకున్న పీఆర్ టీమ్ లు ఇలా పబ్లిసిటీ చేసి ఆమెకు తద్వారా సినిమాకు హైప్ తెచ్చే ప్రయత్నం చేసాయిని అంటున్నారు.

ఫైట్ సీన్స్ లోనే అసలు కష్టం

ఇక ఈ మూవీలో ప్రభాస్ తో ధీటుగా హీరోయిన్ శ్రద్దా కపూర్ ఫైట్ సీన్స్ లో నటించింది. ఫైట్స్ సీన్స్ చేయాలి అంటే ఫిట్ గా ఉండాలి. దీనికోసం జిమ్ తో పాటు పర్ఫెక్ట్ డైట్ తీసుకోవాలి. వీటిని తూచా తప్పకుండా ఫాలో అయ్యింది శ్రద్దా. ఈ విషయాన్ని ఆమె పర్సనల్ ట్రైనర్ మాహెక్ నాయర్ పేర్కొన్నాడు.

రోజు కనీసం 45 నిమిషాల పాటు శ్రద్దా కఠినమైన వ్యాయామం చేసేదని, డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పాడు. షూటింగ్ కు ముందురోజే శ్రద్దా డైట్ కు సంబంధించిన వాటిని ప్రొడక్షన్ వాళ్లకు ఇచ్చేవారట. డైట్ సింపుల్ గా ఉంటూనే చాలా తక్కువగా ఉండేదట. ఆ డైట్ ను చూసి అందరు షాక్ అయ్యేవారట అని చెప్తున్నారు. ఇంతకీ శ్రద్దా కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్లేనా. రిలీజ్ అయ్యాక వచ్చే ఆఫర్స్ ను బట్టి తెలుస్తుంది.