సాయి తేజ చేసిన పనికి తెలుగు డైరక్టర్స్ కు మండుతోంది

సాయి తేజ కూడా ఇలా చేస్తాడని వాళ్లు ఊహించలేదు

ఏ రామ్ చరణ్ కో, బన్నికో కథ రాసుకున్న దర్శకులు వాళ్లతో ప్రాజక్టు సెట్ కాకపోతే ఇంకెవరితో ముందుకు వెళ్లాలి. వెంటనే వాళ్ల మైండ్ లో మెదిలే హీరో పేరు సాయి తేజ. మెగా క్యాంప్ హీరో కావటం, కెరీర్ ప్రారంభంలో హిట్స్ పడటంతో అతనితో సినిమా చేయటానికి చాలా మంది దర్శకులు ఉత్సాహం చూపిస్తారు. అయితే చేయాలనుకున్నవాళ్ళందిరితో సినిమాలు చేయలేడు కనుక కథ నచ్చిన వాళ్లనో, ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్ ఉన్నవాళ్లనో చూసుకుని ముందుకు వెళ్తూంతాడు. ఆ క్రమంలో తమకు ఎప్పుడు ఆఫర్ వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూంటారు మిగతా వాళ్లు. అయితే వాళ్లందనీ నిరాశ పరుస్తూ సాయి తేజ ఓ నిర్ణయం తీసుకున్నాడు.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సాయి తేజ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అజిత్ తో గాంబ్లర్, సూర్యతో మాస్ సినిమాలు చేసిన వెంకట్ ప్రభు ఈ మధ్యన కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. అతను రీసెంట్ గా నిర్మాత అనీల్ సుంకరను కలిసి కథ చెప్పాడు. కథ విన్న వెంటనే ఆ స్టోరీ లైన్ నచ్చి, సాయి తేజకు అయితే సెట్ అవుతుందని భావించి పంపించాడు. సాయి కూడా వెంటనే ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

తెలుగు దర్శకుడు చెప్తే వంద వంకలు చెప్పే మన హీరోలు ఇలా ఓ తమిళ దర్శకుడు కథ వినిపించగానే అద్బుతం అని వెంటనే డేట్స్ ఎలా కేటాయిస్తారంటూ ఫిల్మ్ సర్కిల్ లో సాయి తేజను ట్రై చేద్దామనుకున్నవాళ్లు…ఆల్రెడీ ట్రై చేసి ఆగిపోయినవాళ్లు మండి పడుతున్నారు. ఏదైమైనా హీరో,నిర్మాత కలిసి ఓ ప్రాజెక్టుని ఓకే చేస్తారు. అది వాళ్ల ఇష్టం. వేరే వాళ్లు చేయగలిగేదేముంటుంది. కోపం తెచ్చుకోవటం తప్ప..ఏమంటారు.