సందీప్ కిషన్ కు స్టార్ రేంజ్ ఎప్పుడో?

టాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి హీరోగా సందీప్ కిషన్ చక్కటి పేరు తెచ్చుకున్నాడు.. తరువాత నిర్మాతగా కూడా మారాడు. వీటికి ముందు సందీప్ కిషన్ వ్యాపారి. సక్సెస్‌ఫుల్ జర్నీలో స్టార్ రేంజ్ అందుకోకున్నా, వైవిధ్యాన్ని మాత్రం ఆపాదించుకున్నాడు. మొన్న ‘నినువీడని నీడను నేనే’.. నిన్న ‘తెనాలి రామకృష్ణ’.. సినిమాలతో వైవిధ్యాన్ని చూపించిన సందీప్ .. కమర్షియల్ సక్సెస్‌లు అందుకున్నాడనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ జంట నగరాల్లో రెస్టారెంట్లను విజయవంతంగా నడిపిస్తూ.. మరో కొత్త వ్యాపారంలోకి ఎంటరయ్యాడు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ భిన్నమైన పాత్రలు పోషిస్తోన్న సందీప్ .. తాజాగా ఆంధ్ర రాజధాని అమరావతిలో ‘స్టైలిష్ సెలూన్’కు శ్రీకారం చుట్టడం విశేషం. ప్రస్తుతానికి హాకీ నేపథ్యంలో ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు చేస్తోన్న సందీప్ రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ స్టార్ రేంజ్ తెచ్చుకుంటాడనే అనుకుందాం!!