సెంటిమెంట్ కోసం ‘ఎక్సప్రెస్ ‘ఎక్కుతున్నాడు

ఇది సందీప్ కిషన్ సెంటిమెంట్

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా కెరీర్ లో హిట్స్ రానప్పుడు రకరకాల సెంటిమెంట్స్ ని ప్లే చేస్తూంటారు. హీరోయిన్స్ రిపీట్ చేయటం, తమ హిట్ టైటిల్స్ కు దగ్గరగా ఉండేలా టైటిల్ పెడ్డటం, పేరులో అక్షరాలు మార్చకోవటం, టైటిల్ ని తన హిట్ సినిమా టైటిల్ లో మొదట అక్షరంతో మొదలెట్టడం వంటివి చేస్తూంటారు. సందీప్ కిషన్ సైతం వీటికి అతీతుడు కాదని అర్దమవుతోంది.

కెరీర్ ఏ విధమైన ఎగ్జైమ్మెంట్ లేకుండా సాగుతున్న సమయంలో వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమా వచ్చి నిలబెట్టింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి హిట్ అతనికి పడలేదు. దాంతో ఇప్పుడు ఆ టైటిల్ లోని ఎక్సప్రెస్ ని రిపీట్ చేస్తూ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్.

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో రీసెంట్ గా పలకరించిన సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిష‌న్ చేతిలో హాకీ స్టిక్‌ను ప‌ట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌ం కావటం విశేషం. ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

హిప్ హాప్ త‌మిళ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.