శివ, గాయం, సత్య, రంగీలా, సర్కార్.. వంటి చిత్రాలతో తెలుగు, హిందీ భాషల్లో రామ్‌గోపాల్‌వర్మ పేరు మారుమ్రోగిపోయింది. టెక్నికల్‌గా గొప్ప దర్శకుడు వర్మ అని అంతా గొప్పగా మాట్లాడుకున్నారు. ఇది గతం. ఇప్పడు వర్మ అంటే ఓ బీ గ్రేడ్ చిత్రాల దర్శకుడు. రాత్రి వచ్చిన ఐడియాని తెల్లారే సరికి సినిమాగా మార్చి జనాలమీదికి వదలడం. దాని పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడం.. అవసరమైతే పబ్లిగ్గా హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం.. ఇంత చేసినా తను తీసిన సినిమాలు పట్టుమని పది రోజులు కూడా థియేటర్లలో కనిపించడం లేదు.
గత కొంత కాలంగా వర్మ చేస్తున్న హడావిడి ఇది. `శివ` సినిమాతో దర్శకుడిగా ఎంత కీర్తిని దక్కించుకున్నాడో ఇటీవల చేస్తున్న బీగ్రేడ్ సినిమాలతో అంతే పతనావస్తకు చేరిపోయారు. వర్మ ఇటీవల తీసిన `అమ్మరాజ్యంలో కడప బిడ్డలు` ఎంత నాసిరకంగా, ఎంత స్పీడుగా నిర్మించాడో అ సినిమాని అంతే స్పీడుగా ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. తాజాగా వర్మ తను చెప్పిన కాన్సెప్ట్‌తో అగస్త్య మంజుతో తీయించిన చిత్రం `బ్యూటిఫుల్`. రంగీలా చిత్రానికి ట్రబ్యూట్ అంటూ ప్రచారం చేశారు. ఈ సినిమా ప్రచారం కోసం వర్మ చేసిన రచ్చ మామూలుది కాదు. పబ్లిక్‌లో డ్యాన్సులు చేసి, నడిబజారులో హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లు పట్టుకుని హంగామా చేశాడు.
ఇంత చేసినా ప్రేక్షకుల్లో మాత్రం ఒకటే ఫీలింగ్ వర్మ యూ ఆర్ ఫినిష్. దర్శకుడిగా వర్మ ఎప్పుడో ఔట్ డేటెడ్ అయిపోయాడు. ఇంకా 90ల కాలంలోని హీరోయిన్‌ల ఎక్స్‌పోజింగ్ అనే పాయింట్‌ని పట్టుకుని సినిమాలు చేస్తున్నాడు. చేయిస్తున్నాడు. నైనా గంగూలితో ఓవర్ డోస్ ఎక్స్‌పోజింగ్ చేయించినా `బ్యూటిఫుల్` థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే కొన్ని థియేటర్లలో తీసేశారు కూడా. వర్మ కాళ్లు పట్టుకున్నా జనం కనికరించలేదు. అదీ వర్మ పరిస్థితి. పాతాళానికి పడిపోయిన వర్మ ఇప్పటికైనా ఇలాంటి చవకబారు సినిమాలకు స్వస్థిపలకితే మంచిదని ఫిల్మ్ సర్కిల్స్‌లో సెటైర్లు పడుతున్నాయి.