విజయ్ దేవరకొండ చేస్తోన్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఈవారంతో షూటింగ్ పార్ట్ పూర్తి కానుంది ఇప్పటి వరకూ చేయని రైటర్ పాత్రను విజయ్ దేవరకొండ చేస్తున్నాడట. కథా రచయితగా కనిపిస్తాడని, రాసే కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయని చెబుతున్నారు. ఇలా భిన్నమైన కథాంశంతో సినిమా నిర్మితమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ తరహా కథలతో ఇప్పటికే హాలీవుడ్ మార్క్ చిత్రాలు చాలానే వచ్చాయి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తోన్న సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకుడు. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఫిబ్రవరి 14న సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఈ చిత్రంలోని రైటర్ పాత్ర విజయ్ దేవరకొండకు పేరు తెచ్చేనా? అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
రైటర్ పాత్ర విజయ్ దేవరకొండకు పేరు తెచ్చేనా?
