రష్మిక ప్రేమ బెడిసికొట్టడానికి కారణం ఇదా!?

ఇప్పుడు టాలీవుడ్‌లో కన్నడ భామ రష్మిక మండన్న యంగ్ సెన్సేషన్ గా వెలిగిపోతోంది. ‘గీత గోవిందం’ సినిమా హిట్‌తో రష్మికకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. అయితే స్టార్ కాకముందు రక్ష్మిత్ శెట్టితో ప్రేమలో ఉండటం తెలిసిందే. నిశ్చితార్థం కూడా జరిగిన తరువాత పెళ్లిని రద్దు చేసుకున్నారు ఇద్దరూ. రక్షిత్ శెట్టి హీరోగా అతడే శ్రీమన్నారాయణ చిత్రం వస్తోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ‘ప్రేమ- పెళ్లి’ వ్యవహారం చర్చకొచ్చింది. అనేక సందర్భాల్లో రక్షిత్ దీనిపై మాట్లాడాల్సి రావడంతో వీరి వ్యవహారంపై మళ్లీ చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా రష్మిక మరోసారి క్లారిటీ ఇచ్చింది. రక్షిత్‌పై ప్రేమ పుట్టిన కారణంగానే పెళ్లి వరకూ వెళ్లా. అయితే సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో రెండేళ్లు పెళ్లి వాయిదా వేసుకోవాలని అనుకున్నాం. రెండేళ్లు గడిచేసరికి సినిమా అవకాశాలు అధికం కావడంతో పెళ్లికి సమయం కేటాయించటం సాధ్యం కాలేదు. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని భావించి రద్దు చేసుకున్నా అంటోంది రష్మిక. సో, రష్మిక ప్రేమ బెడిసికొట్టడానికి కారణం నిర్మాతలన్న మాట.