ప్రభాస్ కు వైయస్. జగన్ భారీ గిఫ్ట్ !

జగన్ ప్రభుత్వం ‘సాహో’కు చేసిన హెల్ప్

‘బాహుబలి’ తరవాత ప్రభాస్‌ నుంచి వస్తున్న సినిమా భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ రెండు భాగాలూ కలిపి దాదాపుగా రూ.2500 కోట్లు వసూలు చేశాయి. ఈ సినిమాతో ప్రభాస్‌ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించాడు. దాంతో తదుపరి సినిమాపై మరింత ఇంట్రస్ట్ పెరిగింది. అందుకే ప్రభాస్‌ కూడా స్పెషల్ గా అన్ని జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవాల్సివచ్చింది. ‘సాహో’ బడ్జెట్‌ రూ.300 నుంచి రూ.350 కోట్ల వరకూ ఉంటుందని చెప్తున్నారు. బడ్జెట్‌ ఇంత అని చిత్ర యూనిట్ చెప్పడం లేదు గానీ, ఈ అంకెలకు దగ్గరగానే ఖర్చు చేశారు.

అయితే ఈ రేంజి ఓ రీజనల్ సినిమాకు పెట్టినప్పుడు ఖచ్చితంగా నిర్మాతల్లో దాన్ని ఎలా రాబట్టుగలం అనే స్ట్రాటజీ ఉంటుంది. అదే సమయంలో భయమూ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఉండనే ఉంది. అయితే ఎంత బజ్ ఉన్నప్పటికీ తొలివారం కలెక్షన్లపైనే ఆశ అంతా. సినిమా టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా నిర్మాతలకు కోట్లు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఫస్ట్ వీక్..ఇంకా చెప్పాలంటే ఫస్ట్ వీకెండ్ లోనే సాధ్యమైనంత వెనక్కి రాబట్టాలనేది నిర్మాతల ఆలోచన.

ఇందులో భాగంగా టిక్కెట్ల రేట్ల పెంపుకు నిర్ణయించుకున్నారు నిర్మాతలు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ‘సాహో’ టిక్కెట్ల రేపు పెంపుపై అనుమతి కోరింది యూవీ క్రియేషన్స్. అయితే వీరి విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణాలో మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలాగే ప్రీమియర్ షోలకు సైతం ఫర్మిషన్ రాలేదు. ఆంధ్రాలో ఫర్మిషన్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

దాంతో ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా తొలివారం ‘సాహో’ ప్రదర్శితం అయ్యే థియేటర్లలలో టిక్కెట్ రేటు రెట్టింపు కానుంది. అంటే.. ప్రస్తుత టిక్కెట్ రేటు రూ. 100 ఉంటే.. రూ. 200 కానుంది. ఇది జగన్ ..ప్రభాస్ కు ఇచ్చిన గిప్ట్ గా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్‌లో ప్రభాస్‌కి పెరిగిన క్రేజ్‌ కారణంగా అక్కడి హక్కుల రూపేణా మంచి ధరే పలికింది. చాలా ప్రాంతాల్లో సొంతంగా విడుదల చేసుకుంటోంది చిత్రబృందం. లేదంటే ఈ సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ ఇప్పటికే బయటకు వచ్చేసేవి. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ‘సాహో’కి కలిసొచ్చే అంశం.