ఒక్కొక్కసారి సినిమా హైప్నుబట్టి ఆ సినిమాను చాలా కూల్‌గా చిత్రీకరించుకుంటూ పోతారు. దానికి తగ్గట్టు సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతాయి. కానీ చిరంజీవితో 152వ చిత్రాన్ని రూపొందిస్తున్న కొరటాల శివ మాత్రం స్పీడప్ చేసేయాలి ప్రాజెక్టు అన్నవిధంగా పరిగెత్తిస్తున్నారు యూనిట్‌ను. సోషల్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్లో ఓ గాసిప్ హల్చల్ సృష్టిస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా అంటే, 2020 ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది పొలిటికల్ చిత్రం కనుక ఆగస్టు 15న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోడానికి ఆస్కారం వుంది. అలా కాదు, పొలిటికల్ డ్రామా అన్నా కూడా ఓకె అనుకోవచ్చు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాత్రం వీలైనంత త్వరగా విడుదల చేయడానికే అన్ని సెట్స్ సెట్ అయిపోయినవట. సెట్లన్నీ సిద్ధమైనపోయిన ఈ సినిమాను త్వరత్వరగా పూర్తిచేయటమే కొరటాల శివ ముందున్న ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది.
త్వరలో సెట్స్‌పైకి చిరంజీవి 152వ సినిమా
